బస్సులో బట్టలు విప్పేసి చిల్లర వేషాలు వేసిన అమ్మాయి.. ఏమి చేయలేక చూస్తూ ఉండిపోయిన ప్రజలు.
జనం న్యూస్: అవును... భారతదేశంలో ప్రతీ పౌరుడికీ తినే తిండి, ధరించే దుస్తుల విషయంలో స్వేచ్చ ఉన్న మాట వాస్తవమే కానీ... అది శృతిమించితే, సమాజాన్ని ఇబ్బందులకు గురిచేసేది అయితే మాత్రం ఇబ్బందులు తప్పవనేది తెలిసిన విషయమే! ఈ క్రమంలో ఢిల్లీ పబ్లిక్ బస్సులో ఒక షాకింగ్ దృశ్యానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఒక యువతి తన లోదుస్తులు.. బ్రా, ప్యాంటీలు తప్ప మరేమీ ధరించకుండా రద్దీగా ఉండే పబ్లిక్ బస్సులో ప్రయాణిస్తున్నట్లు కనిపించింది. ఈ సమయంలో పిల్లలు, పురుషులు, మహిళలు అనే తారతమ్యాలు లేకుండా అంతా సమానంగా ఇబ్బందిపడ్డారనే చెప్పాలి. ఈ సమయంలో కొంతమంది ఆమెను చూసిన తర్వాత బస్సు దిగిపోవడం కనిపించింది! ఈ పరిస్థితుల్లో బస్ కండక్టర్ కూడా ఏమీ తెలియనట్లు, ఏమీ చేయలేని పరిస్థితికి చేరుకున్నట్లు తెలుస్తుంది! ఈ సమయంలో సదరు మహిళ ప్రవర్తన పూర్తిగా అసభ్యకరంగా పరిగణించబడింది! లోదుస్తులు ధరించి పబ్లిక్ బస్సులో ప్రయాణించడం తనకే కాదు, అలాంటి ప్రవర్తనను చూసే ఇతర ప్రయాణికులకు కూడా అగౌరవంగా ఉంటుందనే విషయం గ్రహించాలని కోరుతున్నారు.