మనుషులపై దూసుకుపోయిన కారు.. 15 మంది పరిస్థితి విషమం ఒకరు మృతి.. లైవ్ వీడియో చూడండి.

జనం న్యూస్: దేశంలో ప్రతిరోజూ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. డ్రైవర్లు చేసే తప్పిదాల వల్ల ఎంతోమంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నారు. ఎన్నో కుటుంబాలు అనాథలుగా మిగిలిపోతున్నాయి. ఇటీవల రోడ్డు మీదకు వచ్చిన తర్వాత క్షేమంగా ఇంటికి చేరుతామా? లేదా? అన్న భయం కలుగుతుంది. నిర్లక్ష్యం, అతి వేగం, అవగాహన లేమి, మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. ఎన్ని కఠిన చట్టాలు తీసుకువస్తున్నా.. ఇలాంటి ప్రమాదాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మద్యం మత్తులో డ్రైవర్ మార్కెట్ లో విధ్వంసం సృష్టించాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఓ కారు డ్రైవర్ రద్దీగా ఉండే మార్కెట్ లో జనాలపై నుంచి దూసుకుపోయాడు. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈస్ట్ ఢిల్లీలోని ఘాజీపూర్ లో గతరాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. నిందితుడిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. చనిపోయిన మహిళను యూపీలోని ఘజియాబాద్ కు చెందిన 22 ఏళ్ల సీతాదేవిగా గుర్తించారు. గాయపడిన వారిని దగ్గరలోని లాల్ బహదూర్ శాస్త్రి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనలో అక్కడ కొన్ని షాపులు కూడా ధ్వంసం అయ్యాయి. ఈస్ట్ ఢిల్లీలోని ఘాజీపూర్ లో ఉన్న బుద్ద్ మార్కెట్ కి రాత్రి 9 గంటల ప్రాంతంలో ట్యాక్సీ డ్రైవర్ మయూర్ విహార్ మద్యం మత్తులో జనాలపై తొక్కించుకుంటూ పోయాడు. కారు ఒక్కసారే అదుపు తప్పి జనాలపైకి రావడంతో అక్కడ ఉన్నవాళ్లంతా ఉరుకులు పరుగులు పెట్టారు. అప్పటికే పలువురిపై కారు దూసుకు పోవడంతో ఓ మహిళకు తీవ్రంగా గాయాలు కావడం చనిపోవడం జరిగింది. మరికొంతమంది కి గాయాలు అయ్యాయి. స్థానికులు అప్రమత్తమైన డ్రైవర్ ని పట్టుకొని దేహశుద్ది చేశారు. కారును ధ్వంసం చేశారు.. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడికి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.