మాజీమంత్రి హరీష్ రావు అరెస్ట్ కేశంపేట్ పీ ఎస్ కి తరలింపు..

మాజీమంత్రి  హరీష్ రావు అరెస్ట్ కేశంపేట్ పీ ఎస్ కి తరలింపు..

జనం న్యూస్(13 సెప్టెంబర్ 2024)( కేశంపేట మండలం) కేశంపేట్ పోలీస్ స్టేషన్ కి మాజీ మంత్రి హరీష్ రావు ని తరలించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు కొత్తపేట గ్రామంలో అడ్డుకోవడానికి యత్నించగా పోలీసులకు బి ఆర్ ఎస్ కార్యకర్తలకు తోపులాట జరిగింది. అనంతరంమాజీ మంత్రిహరీష్ రావు తో పాటు, మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, తదితర నాయకులను కేశంపేట పోలీస్ స్టేషన్ కి తరలించారు. పోలీస్ స్టేషన్ వద్ద బిఆర్ఎస్ నాయకులు చేరుకొని పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు.