మా అమ్మాయిని ఏడిపిస్థారా..! అని అడిగినందుకు వ్యక్తిని చావబాధిన అల్లరి మూకలు (వీడియో చూడండి)

జనం న్యూస్: రాష్ట్రంలో గంజాయి బ్యాచ్ ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. నేరాలు కూడా అదేస్థాయిలో పెచ్చరిల్లిపోతున్నాయి. ఒంగోలులో మా అమ్మాయిని వేధిస్తారా అని అడిగినాడు ఓ యువకుడిని గంజాయి సేవించే గ్యాంగ్ ఒకటి చితక బాదిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో బాధితుడిని బైకు పై నుంచి కింద పడేసిన కొందరు యువకులు కర్రలతో గొడ్డును బాదినట్లు బాదుతున్నారు. తమనే నిలదీస్తావా అంటూ బూతులు తిడుతూ కాళ్లతో తన్నుతో నడిరోడ్డుపై కర్రలతో చావబాదుతున్నారు. ఈ ఘటన ఒంగోలులోని శర్మ కాలేజి ఎదుట జరిగినట్లు వీడియోలో చెప్పబడింది. కాగా సోషల్ మీడియా లో ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది. పోలీసులు ఈ ఘటనపై వెంటనే స్పందించి దాడికి పాల్పడిన అల్లరి మూకల పైన తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.