ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రైతుల ఓట్లు కావాలి.. రైతుల వడ్లు పట్టవు.
జనం న్యూస్ 04 నవంబర్ 2024. జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్ సర్కార్.. నెలరోజులైన వడ్లు కొనుగోలు చేయడం లేదు.ఓట్లప్పుడు ఊరురా తిరిగి రైతుల మద్ధతు కోరిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు రైతుల దగ్గరికి వెళ్లి మద్ధతు ధర వస్తుందా లేదా అని ఎందుకు అడగట్లేదు.*
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతుల ఉసురుపోసుకుంటుండు.
15, 20 రోజులుగా రైతులు ఇంటికి వెళ్లకుండా.. వడ్ల కల్లాల దగ్గరే కావాలి కాస్తున్నారు.
....................................................................
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం బద్దిపడగ గ్రామంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన మాజీ మంత్రి హరీశ్‌రావు..
మాజీ మంత్రి హరీశ్‌రావు కామెంట్స్:
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు కనీస మద్దతు దక్కడం లేదు.
కేసీఆర్ హయాంలో వడ్లు కల్లాలకు రాకముందే సంచులు పంపించి, మిల్లులు టైయ్యప్ చేపించి, ట్రాన్స్ పోర్ట్ ఏర్పాటు చేసి మరీ రైతుల నుంచి వడ్లు కొనుగోలు చేశారు
కానీ, రేవంత్ సర్కార్ నెలరోజులైన వడ్లు కొనుగోలు చేయడం లేదు.
కోతులు, పందికొక్కులు వడ్లను నాశనం చేస్తున్నాయి. రైతులంతా ఇంటికి వెళ్లకుండా కల్లాల కాడా కావాలి కాస్తున్నారు.
ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి రైతుల మద్దతు కోరాడు. కానీ ఇప్పుడు వడ్లకు కనీస మద్దతు ధర ఇవ్వడం లేదు.
జగిత్యాల జిల్లా, మహబూబాబాద్, సూర్యాపేట, రాజన్నసిరిసిల్లలో రైతులంతా రోడ్కెక్కి ధర్నాలు చేస్తున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతులను రోడ్డుపై పడేశారు.
రైతుల ఓట్లు కావాలి కానీ, రైతుల వడ్లు పట్టవ రేవంత్‌రెడ్డి..
ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఒక్కరోజైన వడ్ల కొనుగోలుపై రివ్యూ చేపట్టావా?
ఓట్లప్పుడు ఊరురా తిరిగిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ఎందుకు రైతుల దగ్గరికి వెళ్లట్లేదు.
కొనుగోలు కేంద్రాల్లో రైతుల బాధలు, కష్టాలు తెలుసుకో..
వడ్ల కొనుగోలు జరుగుంతా లేదా అని రేవంత్‌రెడ్డి గానీ, మంత్రులు గానీ ఏ ఒక్కరు పట్టించుకోవట్లేదు
కేసీఆర్ రైతుబందు రెండు సార్లు ఇస్తే.. మూడుసార్లు ఇవ్వాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేసిండు. కానీ ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఒక్కసారి కూడా రైతుబందు ఇవ్వలేదు.
రేవంత్‌రెడ్డి రైతుల ఉసురుపోసుకుంటుండు.
రాష్ట్రంలో మక్కలు కొనే దిక్కులేదు. కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయలేదు.
7,521లకు కొనుగోలు చేయాల్సిన పత్తి.. కేవలం 5000లకు రైతులు అమ్ముకుంటున్నారు.
పత్తికి మద్ధతు ధర లేకపాయే.. మక్కల కొనుగోలు కేంద్రాలు లేవు.. వడ్లు 1800లకే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రైతులు పంట పండించుకునేందుకు కష్టపడాలి. పండించిన పంటను కూడా అమ్ముకునేందుకు కష్టపడాలా ?
ఇదేనా రేవంత్ రెడ్డి నువ్వు రైతులకు చేసే సేవా..?
రాష్ట్రంలో ఇంకా 22లక్షల మందికి రుణమాఫీ కాలేదు.
వంద కారణాలు చూపించి చాలా మందికి రుణమాఫీ చేయలేదు.
కరోనా మహమ్మారి సమయంలో కూడా కేసీఆర్ రైతుబందు డబ్బులు రైతుల ఖాతాల్లో వేశారు.
వడ్ల కొనుగోలు కేంద్రాలకు ముఖ్యమంత్రి రాడు. మంత్రులు రారు. కలెక్టర్లు రారు.
ఆదిలాబాద్ జిల్లాలో సోయాబీన్ కొనుగోలు చేసిన ప్రభుత్వం రెండు నెలలైనా డబ్బులు ఇవ్వలేదు.
దీంతో చాలా మంది రైతులు దళారులకు అమ్ముకుంటున్నారు.
సిద్దిపేట జిల్లాలో 3.60 లక్షల ఎకరాల్లో వానకాలం వరి సాగు అయ్యింది.
9 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండుతాయి. కానీ ఇప్పటి వరకు అధికారులు వెయ్యి మెట్రిక్ టన్నుల వడ్లు కూడా కొనలేదు.
కేసీఆర్ హయాంలో మంత్రులు, ఎమ్మెల్యేలా జీతాలు ఆపి మరీ.. రైతులకు రైతుబందు డబ్బులు వేశారు.
11సార్లు కేసీఆర్ 72,815కోట్లు రైతుబందు డబ్బులు వేశారు.
రైతులకు గన్ని బ్యాగులు, టార్పాలిన్ కవర్లు, ఇచ్చే తెలివి కూడా రేవంత్ రెడ్డికి లేదు.
ముఖ్యమంత్రి, మంత్రులు హైదరాబాద్‌ను వదిలి, కొనుగోలు కేంద్రాల్లోకి వెళ్లి వడ్ల కొనుగోలు కేంద్రాలను పరిశీలించాలి. రైతులకు మద్ధతు ధర ఇవ్వాలి. 500 బోనస్ ఇవ్వాలి. లేకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నాలు చేపట్టి ప్రభుత్వాన్ని నిలదీస్తాం.