రేయ్ ఎవర్రా మీరంతా.. మరీ ఇంత దారుణంగా ఉన్నారెంట్రా.. వీడియో చూస్తే షాక్ అవుతారు.

జనం న్యూస్: వర్షం నీటిలో తడవాలని అందరూ తహతహలాడుతున్నారు. జోరువానలో పిల్లలు తడిసి ముద్దవడం మీరు తరచుగా చూస్తూనే ఉంటారు. కొందరు కాగితపు పడవలు చేస్తూ రోడ్డు మీద నుంచి ప్రవహించే నీటిలో వదిలేస్తూ సరదాగా గడుపుతుంటారు. పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా ప్రకృతి ప్రేమికులు తొలకరి వర్షాన్ని ఆస్వాదిస్తుంటారు. ఇప్పటికే మనం ఓ ఎలుక కూడా వర్షంలో గంతులేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ కావడం చూశాం. ఇక అలాంటిదే వర్షంలో ఎంజాయ్‌ చేస్తున్న ఓ యువకుడి వీడియో వైరల్ అవుతోంది. ఆశ్చర్యకరంగా, ఈ యువకుడు జోరు వానలో అతడు చేస్తున్న పనికి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. వీడియో చూశాక మీరు కూడా షాక్‌ అవుతారు. వీడియో చూస్తే నవ్వు ఆగదు. ఈ వీడియో పూణెలోని ఎరవాడ ప్రాంతానికి చెందినదిగా తెలిసింది. వీడియోలో ఒక యువకుడు వీధిలో నీటిపై తేలియాడుతున్న మందపాటి తెల్లటి చాపపై పడుకుని ఉన్నాడు. రోడ్డుపై ప్రవహించే నీటితో చాప కూడా ప్రవహిస్తోంది. దానిపై ఆ యువకుడు మాత్రం హాయిగా సేదతీరుతున్నాడు.. ఈ సీన్ చూసి అందరూ షాక్ అవుతున్నారు. పైగా అతడు రోడ్డుపై వెళ్తున్న వాహనాలకు చేయి ఊపుతూ సైడ్ సైడ్ అనుకుంటూ నడిరోడ్డుపై బోటింగ్ చేస్తున్నాడు. చాలా మంది వానను ఆస్వాదించడాన్ని మీరు చూసి ఉండవచ్చు. కానీ, ఇలాంటి వింత ఎంజాయ్‌మెంట్‌ని మాత్రం ఇప్పుడే మొదటిసారిగా చూసి ఉంటారు. ఈ వీడియోను mipunekar.in అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు. ప్రజలు ఈ వీడియోను పెద్ద సంఖ్యలో లైక్ చేసారు. పలువురు దానిపై ఫన్నీ కామెంట్స్ చేశారు. అలాగే, నేరుగా ఎరవాడ జైలుకు వెళ్లు గురూ అంటూ కొందరు ఫన్నీగా కామెంట్‌ చేవారు. మరికొందరు మన మనసుల్ని గెలిచావ్‌ బాస్‌ అంటూ కామెంట్ చేశారు. హాలో బ్రో.. అలాగే వెళ్తే నెక్ట్స్‌ మురుగు కాల్వలోకే వెళ్లేది అంటూ కామెంట్స్‌లో రాసుకొచ్చారు.