ఏలా వస్తాయి రా మీకు ఇలాంటి ఐడియాలు.. ట్రాఫిక్ పోలీసును చూసి ఈ పిల్లాడు చేసిన పని చూడండి

జనం న్యూస్: ట్రాఫిక్ రూల్స్ ప్రకారం బండి బయటికి తీయాలంటే.. హెల్మెట్ తప్పనిసరి. అయితే ఈ మధ్యకాలంలో చాలామంది హెల్మెట్ లేకుండా రయ్.. రయ్ మంటూ బైక్స్ నడుపుతున్నారు. మరి హఠాత్తుగా పోలీసులు కంటపడితే.. కొందరు దొరికిపోతున్నారు. మరికొందరు రకరకాల ట్రిక్కులు ఉపయోగించి జరిమానాల నుంచి తప్పించుకుంటారు. తాజాగా ఓ కుర్రాడు ప్లే చేసిన ట్రిక్‌కు పోలీసులు చిత్తు అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వైరల్ వీడియో ప్రకారం.. ఓ కుర్రాడు హెల్మెట్ లేకుండా స్కూటీపై వెళ్తున్నాడు. అంతలో రోడ్డుపై అతడికి ట్రాఫిక్ పోలీసులు కనిపించారు. దీంతో ఆ కుర్రాడు ఓ ట్రిక్కు ఉపయోగించి పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. ఆ కుర్రాడు పోలీసులను చూడగానే స్కూటీ దిగి తోసుకుంటూ ముందుకు వెళ్లిపోయాడు. దీంతో పోలీసులు అతడిని పట్టించుకోలేదు. పోలీసులను దాటి పోగానే ఆ కుర్రాడు స్కూటీ స్టార్ట్ చేసుకుని వేగంగా అక్కడ నుంచి జారుకున్నాడు. దీన్ని అటుగా రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది కాస్తా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ఈ ట్రిక్ తెలియక ఇప్పటికి ఎన్నోసార్లు ఫైన్ కట్టామా’ అని అనుకుంటూ నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు