లగచర్ల రైతులను భేషరతుగా విడుదల చేయాలి
బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు వైరమణ గౌడ్ డిమాండ్....
అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేత..
జనం న్యూస్ డిసెంబర్17.24 శివంపేట మండలం మెదక్ జిల్లా కే సత్యనారాయణ గౌడ్
రాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా భూములు గుంజుకోవాలని చూస్తే కడుపుమంటతో ఎదురు తిరిగిన లగచర్ల రైతులను బేషరతుగా ప్రభుత్వం విడుదల చేయాలని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రమణ గౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఅర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన శివ్వంపేటలో నిరసన కార్యక్రమం చేపట్టి అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈసందర్బంగా మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు వై రమణ గౌడ్ మాట్లాడుతూ లగచర్లలో పేద రైతులపై ప్రభుత్వం పెద్ద పెద్ద సెక్షన్ ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయడం దారుణమని మండిపడ్డారు. సీఎం తన సోదరుల కోసం రైతుల భూములను గుంజుకోవాలని కుట్రలు చేయడం అన్యాయమని రమణ గౌడ్ మండిపడ్డారు. రైతులకు బేడీలు వేసి చిత్రహింసలకు గురి చేస్తున్న పోలీసులపై తక్షణమే చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం లగచర్ల రైతులపై అక్రమంగా పెట్టిన కేసులను ఉపసంహారించుకొని, భేషరతుగా వెంటనే విడుదల చేయాలని వై రమణ గౌడ్ డిమాండ్ చేశారు. లగచర్ల రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎల్లపుడు అండగా ఉండి పోరాడుతుందని ఆయన అన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ మాజీ చైర్మన్ చంద్రాగౌడ్, మొలుగు నాగేశ్వరరావు, ఆకుల శ్రీనివాస్, గూడూరు యాదగౌడ్,కల్లూరి వెంకటేష్, పత్రాల శ్రీనివాస్ గౌడ్, లక్ష్మీనర్సయ్య,బిక్షపతి రెడ్డి, మహిపాల్ రెడ్డి, కుమ్మరి హనుమంతు. రాజుపేట. వెంకటేష్ రామచంద్ర గౌడ్. దొడ్ల అశోక్ . వంజరి కొండల్ బాబురావు తదితరులు పాల్గొన్నారు.