ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ను బద్నాం చేస్తే ఖాభర్ధర్; ఎంఏ ఎజాజ్
జనం న్యూస్ 11 డిసెంబర్ ఆలేరు యాదాద్రి జిల్లా (రిపోర్టర్ ఎండి జహంగీర్) ఆలేరు పట్టణంలోని కాంగ్రెస్ భవనంలో మండల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మండల పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగినది సమావేశంలో పట్టణ అధ్యక్షులు ఎంఏ ఏజాజ్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి మతకలహాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇద్దరు నాయకుల మధ్యన స్థల వివాదంపై స్థానిక ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య పై అనుచిత వ్యాఖ్యలు చేసిన గొంగడి మహేందర్ రెడ్డి నిజానిజాలు తెలుసుకొని మాట్లాడాలి అని స్థానిక ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధిని ఓరువ లేక చిల్లర రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు పాల్గొన్నవారు మండల అధ్యక్షులు వెంకట్ రాజు నాయకులు గందమల్ల అశోక్ నీలం వెంకటస్వామి కుళ్ళ నరసింహులు పర్ష నరేష్ కొత్తపల్లి రాజు వినయ్ కూళ్ల సిద్ధులు బండ్రు జాంగిర్ బాబా తదితరులు పాల్గొన్నారు