వామ్మో చలి.. వణికిపోతున్న విజయనగర వాసులు

వామ్మో చలి.. వణికిపోతున్న విజయనగర వాసులు

జనం న్యూస్ 10 నవంబర్
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
ఉష్ణోగ్రతలు తగ్గడంతో విజయనగరంలో చలి మొదలైంది. పగటి వేళల్లో సాధారణ ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ రాత్రి సమయాల్లో క్రమంగా తగ్గుతున్నాయి. దీంతో ప్రజలు, కార్తీక భక్తులు ఇబ్బంది పడుతున్నారు. చలి తీవ్రత దృష్ట్యా స్వటర్లు, జర్కిన్లు, దుప్పట్లకు డిమాండ్‌ పెరుగుతుంది. చిన్న పిల్లలు, వయో వృద్ధులు, ఆస్తమా వ్యాధిగ్రస్తులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూసిస్తున్నారు.