వామ్మో.. 15 ఏళ్ల పిల్లాడితో లేచిపోన 30 ఏళ్ల యువతి.. సీన్ కట్ చేస్తే.

వామ్మో.. 15 ఏళ్ల పిల్లాడితో లేచిపోన 30 ఏళ్ల యువతి.. సీన్ కట్ చేస్తే.

జనం న్యూస్: పెళ్లి సమయంలో కలకాలం కలిసి ఉంటామని భార్యాభర్తలు ఇద్దరు బాస చేసుకుంటారు. ఎలాంటి కష్టం వచ్చినా…. నష్టం వచ్చినా కలకాలం నీకు తోడై ఉంటానని మాట ఇచ్చుకుంటారు. కానీ అలా కలిసి ఉండేవాళ్ళు ఈ కాలంలో కనిపించడం లేదు. తాజాగా జరిగిన ఘటన అందరినీ షాక్ అయ్యేలా చేస్తోంది. భర్త అనారోగ్యం పాలయ్యాడని భార్య అతడిని చూసుకోకుండా 15 ఏళ్ల యువకుడితో ఇంటి నుండి పారిపోయింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా గుడివాడలో జరిగింది. గుడివాడ కు చెందిన స్వప్న అనే వివాహిత భర్త అనారోగ్యానికి గురయ్యాడు. దాంతో ప్రస్తుతం అతడు వేరే ప్రాంతంలో ఉంటూ చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఇద్దరు పిల్లలు స్వప్న వద్దనే గుడివాడలో ఉంటున్నారు. అయితే భర్త బాగోగులు….పిల్లల ఆలనా పాలనా చుస్కోవాల్సిన భార్య స్వప్న అడ్డదారులు తొక్కింది.

ఇంటికి దగ్గరో ఉన్న 15 ఏళ్ల బాలుడిని ముగ్గులోకి దింపింది. ఆంటీ అంటూ ఇంటికి వచ్చే అతడి పై కన్నేసింది. తన కోరికలు తీర్చుకునేందుకు అతడిని వాడుకుంది. ఇక ఈ విషయం బాలుడి ఇంట్లో తెలిసిపోయింది. చదువు పక్కన పెట్టిన బాలుడు తరచూ స్వప్న ఇంటికి వెళ్ళడం తల్లి దండ్రులు గమనించి హెచ్చరించారు. విషయం తెలుసుకున్న స్వప్న తనకు బాలుడు ఎక్కడ దూరం అవుతాడో అని అతనిని తీసుకుని ఈనెల ఇంటి నుండి పారిపోయింది. ఇక ఇద్దరూ కలిసి హైదరాబాదులోని ఓ ప్రాంతంలో గదిని అద్దెకు తీసుకున్నారు. కాగా ఇటీవల బాలుడికి తన తల్లిదండ్రులను చూడాలనిపించి వారికి ఫోన్ చేశాడు. దాంతో అడ్రస్ తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేసి బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు.