విజయనగరంలో మూడు రోజుల పాటు లేబర్ హాలిడే!
జనం న్యూస్ 03 నవంబర్
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
పైడితల్లి ఉత్సవ నిర్వహణ కమిటీతో కలెక్టర్ అంబేడ్కర్ తమ ఛాంబర్లో బుధవారం సమీక్ష నిర్వహించారు.
విజయనగరం ఉత్సవాలు, అమ్మవారి పండుగకు లక్షలాది మంది వచ్చే అవకాశం ఉన్నందున, ట్రాఫిక్కు అంతరాయం, భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆ మూడు రోజుల పాటు లేబర్ హాలీడే ప్రకటించాలన్న విషయంపై చర్చించారు. ఆహార పదార్థాలకు ఇబ్బంది పడకుండా భారీ ఎత్తున ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయాలని సూచించారు.