విలువలతో కూడిన విద్య అవసరం : మాజీ కేంద్ర మంత్రి అశోకగజపతిరాజు
జనం న్యూస్ 22 నవంబర్
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
సమాజంలో ఉన్నతంగా ఎదిగేందుకు విలువలతో కూడిన విద్య అవసరమని, జీవితంలో విజేతలు గా నిలవాలంటే విలువలు అవసరమని మాజీ కేంద్ర మంత్రి పి. అశోకగజపతిరాజు అన్నారు. 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా జిల్లా గ్రంథాలయ సేవా సంఘం ఆధ్వర్యంలో "గ్రంథాలయ ఆవశ్యకత " అను అంశంపై పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటిల్లో విజేతలుగా నిలిచిన వారికీ గురువారం ప్రశంసాపత్రాలు, బహుమతులను అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్లేందుకు, ఉత్తమ వ్యక్తులుగా తీర్చిదిద్ద బడేందుకు విద్యార్థి దశ చాలా కీలకమని అన్నారు. విద్యతో బాటు ప్రతీ ఒక్కరికి క్రమశిక్షణ, సమయపాలన అవసరమని, నిరంతర సాధన ద్వారానే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలరని సూచించారు. ఈ సందర్బంగా విజేతలందరిని అభినందించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు ఎర్నాయుడు, ఉపాధ్యక్షులు కె. దయానంద్, గౌరవ అధ్యక్షులు నాలుగెస్సులరాజు, మోనంగి జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.