సమస్య ఏదైనా మేమున్నామంటూ భరోసానిచ్చిన ఎమ్మెల్యే దంపతులు
(జనం న్యూస్) అక్టోబర్ 4 కల్లూరు మండల మండల రిపోర్టర్ సురేష్:- మండలం లోని శాంతినగర్ కాలనీకి సంబంధించిన స్మశాన వాటిక దట్టమైన తుమ్మ చెట్లతో నిండిపోయి, అడవిని తలపిస్తుందని స్మశాన వాటికలోకి ప్రవేశించడానికి వీలుకానంతగా పిచ్చి మొక్కలు పెరిగి భయంకరంగా ఉన్నదని స్థానిక ఎస్డిఎస్ నాయకులు ఖమ్మంపాటి వీరస్వామి, శ్రీనివాసులు సత్తుపల్లి ఎమ్మెల్యే దంపతులను కలుసుకొని సమస్యను తెలియజేయగా, వారు వెంటనే స్థానిక గ్రామపంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేసి వెంటనే స్థానిక సమస్యను పరిష్కరించాలని తెలిపారు. గ్రామపంచాయతీ సెక్రటరీ నంది శెట్టి నాగేశ్వరరావు సహకారంతో శాంతినగర్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు, యువకుల ఆధ్వర్యంలో ఈరోజు స్మశాన వాటిక పనులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే , అలాగే గ్రామపంచాయతీ సెక్రటరీ నందిశెట్టి నాగేశ్వరరావు లకు శాంతినగర్ వాసులు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో శాంతినగర్ లో జరిగిన డెవలప్మెంట్ కార్యక్రమాల్లో భాగంగా వరద బాధితులను గుర్తించడం, వారికిసహాయ సహకారాలు అందించడం, కాలనీ ఇళ్లను సర్వే చేయించడం, పెన్షన్ దారులు గుర్తించడం లాంటి ఎన్నో సమస్యలపై ఎస్డిఎస్ పూర్తి నివేదికను ఎమ్మెల్యే దంపతులకు అందించిందని అన్నారు. శాంతినగర్ లో జరిగిన ప్రతి కార్యక్రమంలో ఎమ్మెల్యే దంపతులది ముఖ్య భూమిక అని,, వారికి ఎస్డిఎస్ సభ్యులు శాంతినగర్ ప్రజలు సభ్యులందరూ రుణపడి ఉన్నారని ఈ సందర్భంగా తెలిపారు.