32 పళ్ళతో జన్మించిన శిశువు.. చూస్తే షాక్ అవుతారు.

32 పళ్ళతో జన్మించిన శిశువు.. చూస్తే షాక్ అవుతారు.

జనం న్యూస్: పిల్లలకు సాధారణంగా ఆరు నెలల నుంచి 12 నెలల మధ్య దంతాలు రావడం ప్రారంభిస్తాయి. అయితే పూర్తిగా దంతాలు రావడానికి చాలా సంవత్సరాలు పడతాయి. అయితే ఎవరైనా శిశివు 32 పళ్ళతో పుడితే? నమ్మశక్యం కాని విషయంగా అనుకుంటారు కదా.. అమెరికాకు చెందిన ఓ మహిళ ఇదే తరహాలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ వీడియో చూసిన జనాలు ఉలిక్కిపడ్డారు. ఇది చాలా అరుదైన సంఘటన అని వైద్యులు చెబుతున్నారు. 

దీనిని నియోనాటల్ పళ్ళు లేదా నేటల్ దంతాలు అంటారు. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్‌లో నివసిస్తున్న నికా దివా అనే మహిళ తన నవజాత శిశువుకి ఎదురైన అరుదైన పరిస్థితి గురించి అవగాహన కల్పించడానికి టిక్‌టాక్ సహాయం తీసుకుంది. తన కూతురు దంతాలతో పుట్టిందని చెప్పింది. ఇందుకు సంబంధించిన ఒక వీడియోను కూడా షేర్ చేసింది ఆ శిశివు తల్లి. అందులో పుట్టినప్పటి నుండి ఇప్పటివరకు ఉన్న అమ్మాయి చిత్రాలున్నాయి. నికా దివా చెప్పిన ప్రకారం తన కుమార్తెను మొదటిసారి చేతిలోకి తీసుకున్నప్పుడు తన చిన్నారి నోటిలోని అన్ని పళ్ళను చూసి షాక్ తింది. ఇది చాలా అరుదైన వ్యాధి అని.. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు దీనిపై అవగాహన కల్పించే పనిలో ఉన్నామని వైద్యులు ఆమెకు చెప్పారు. ఇది జోక్ కాదని ఆ మహిళ చెప్పింది. చాలా మంది ఈ పోస్ట్‌ను సీరియస్‌గా తీసుకోవాలని కామెంట్ చేయగా.. కొంతమంది మాత్రం ఇలాంటి సంఘటలు కూడా జరగవచ్చు నమ్మారు. @ika.diwa Insta ఖాతాలో షేర్ చేసిన వీడియో క్లిప్ని ఇప్పటికే మూడు కోట్ల మందికి పైగా చూశారు