బాల విద్యార్థి గణపతిని దర్శించుకున్న ఎంపీ హరీష్

బాల విద్యార్థి గణపతిని దర్శించుకున్న ఎంపీ హరీష్

జనం న్యూస్ సెప్టెంబర్ 22 కాట్రేను కోన
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాఅమలాపురం   బాల విద్యార్థి గణపతి మండపం కు అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరిష్ బాలయోగి  విచ్చేసి గణపతి తీర్థ ప్రసారం స్వీకరించి స్వామి వారి అశిస్సులు పొందారు. బాల విద్యార్థి గణపతి సంఘం కమీటి సభ్యులు పార్లమెంటు సభ్యులు హరిష్  కి స్వాగతం పలికారు. హరీష్ మాధురికి కమీటి సభ్యులు ఆజాద్ నాగసుధా కొండ, అడబాల బుజ్జి శాలువా కప్పి సన్మానించారు.తదుపరి గత కొన్ని సంవత్సరాల గా లైటింగ్ తో మండపం అలంకరణ ఎలాంటి ఇబ్బందులు లేకుండా బాల విద్యార్థి గణపతి సంఘం కి సహకరిస్తున్న లోకనాధం & లైటింగ్ యాజమాని లైటింగ్ రమణ కి ఎంపీ హరీష్ మాధుర్ చేతులమీదుగా శాలువ తో సన్నానం చేశారు. 60వ వార్షికోత్సవం సందర్భంగా బాల విద్యార్థి గణపతి సంఘం సభ్యులను ఎంపీ హరీష్  అభినందనలు తెలిపారు