ఎక్కడో కాదు ఇంత గోరం మా తెలంగాణా గాలొనే
జనం న్యూస్ 13 అక్టోబర్ 2024 జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా ఉత్తరప్రదేశ్,బీహార్ రాష్ట్రాలలో కాదు - స్వయంగా తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లాలో కంటికి కనిపించని విధంగా,ఉహించని విధంగా,అంతర్మథనంలో దళితులపై మనువాదులు దాడులు జరుపుతున్నారు.
ఇప్పుడు కనుక మేల్కొని ప్రశ్నించకపోతే గ్రామ గ్రామాన మనపై కానీ,మన అక్క చెల్లెళ్లపై కానీ,మనువాదులకు దాడులు జరిపే విధంగా అవకాశం మనకు మనమే ఇచ్చిన వాలమవుతాము.
మేల్కోందాం బాధితులకు అండగా నిలబడదాం - అణగారిన వర్గాల ప్రజలకు బాసటగా,అండగా ధైర్యమిద్దాం.నిందితులను అరెస్ట్ చేసే వరకు - బాధితుల కుటుంబాలకు అండగా నిలబడ్డారు
ఎస్.తిరుమలేష్ బిజ్వారం
బాధితురాలికి న్యాయం జరగాలని అండగా నిలబడిన ఎమ్మార్పీఎస్ అలంపూర్ తాలూకా ఇంచార్జి జయరాజ్ మాదిగ,కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు కొర్రిపాడు మధుఅటెంప్ట్ మర్డర్ 307 సెక్షన్ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలి న్యాయం కొరకు మానవపాడు పోలీస్ స్టేషన్ ముందు ధర్నా,,జోగులాంబ గద్వాల జిల్లా : మానవపాడు మండలం
చిన్న పోతులపాడు గ్రామంలో గురువారం -
తేదీ 10-10-2024 నాడు- ప్రశాంతమ్మ అలియాస్ (ఎస్తేరమ్మ) రామకృష్ణ అనే మహిళ వయస్సు 27 ఆమె ఇంటిదగ్గర బజ్జీల బండి పెట్టుకొని బజ్జీలు చేసుకొనుచుండగా - ఆమె ఇంటి పక్కన ఉన్న
1. చాకలియుగంధర్ S/O చాకలి చంద్ర వయస్సు 30
2. చాకలి సత్తి (తండ్రి )చాకలి చంద్ర వయస్సు 28
3. అరుణమ్మ W/O చంద్ర వీరు ముగ్గురు గురువారం
రోజున అన్నదమ్ములు బజ్జీల బండి దగ్గరకు వచ్చి ఇక్కడ బజ్జీలు ఎందుకు అమ్ముతున్నావు మాదిగ లంజా అని బూతులు తిడుతూ -- బజ్జీల వేడి నూనెతో ఆమెపై దాడి చేయడం జరిగింది .ప్రస్తుతం బాధితురాలు ఎస్తేరమ్మ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది
ఈ సంఘటనపై మానవపాడు ఎస్సై చంద్రకాంత్ దాడి చేసిన వ్యక్తులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు ప్రశాంతమ్మ అలియాస్ (ఎస్తేరమ్మ) దగ్గరకు వెళ్లి ఆమె యొక్క వాంగ్మూలము తీసుకోలేదు దాడి చేసిన ముగ్గురు వ్యక్తులను కఠినంగా శిక్షించి బాధితురాలికి న్యాయం జరిగే వరకు
వెనక్కి తగ్గేది లేదని ఎమ్మార్పీఎస్ అలంపూర్ తాలూకా ఇన్చార్జి జయరాజు శనివారం మానవపాడు పోలీస్ స్టేషన్ నందు 100 మందితో ధర్నా చేశారు,,,ధర్నాలో చిన్న పోతులపాడు గ్రామం ఎస్సీ మహిళలు యువకులు పాల్గొన్నారు