గంజాయి అక్రమ రవాణాకు పాల్పడితే పి.డి.చట్టం ప్రయోగిస్తాం

గంజాయి అక్రమ రవాణాకు పాల్పడితే పి.డి.చట్టం ప్రయోగిస్తాం

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 20 డిసెంబర్
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ గారు డిసెంబరు 19న వంగర పోలీసు స్టేషను సందర్శించి, స్టేషను పరిసరాలు, లాకప్ సెల్స్, ప్రాపర్టీ రూంను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ పరిశీలించారు.
గంజాయి అక్రమ రవాణ, వినియోగం, విక్రయాల నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలో గంజాయి అక్రమ రవాణాకు వినియోగిస్తున్న మార్గాలను గుర్తించి, నిరంతర తనిఖీలు చేపట్టే విధంగా చర్యలు చేపట్టామని, ఐదు చెక్ పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. ఆకస్మికంగా డైనమిక్ వాహన తనిఖీలను ప్రతీ రోజూ పది ప్రాంతాల్లో చేపడుతున్నామన్నారు.జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మహిళా సంరక్షణ పోలీసులు, పోలీసు సిబ్బందితో మమేకమై, వారికి దత్తతగా అప్పగించిన గ్రామాల్లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు, భూతగదాలు,  గొడవలు, వివిధ రాజకీయ పార్టీల వైరంలు, పాత నేరస్తులు, హిస్టరీ షీట్లు కలిగిన వ్యక్తుల పేర్లు, గంజాయి రవాణా, విక్రయాలు, వినియోగం గురించి సమాచారం సేకరించి, ఉన్నతాధికారులకు అందజేయాలన్నారు. ప్రతీ వారం విధిగా దత్తత గ్రామాల్లో పోలీసులు సందర్శించాలని, ప్రజలకు సైబరు మోసాలు, డిజిటల్ అరెస్టు, మహిళల భద్రత, రహదారి భద్రత పట్ల క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఎవరైనా సైబరు మోసానికి గురైతే 1930కు ఫిర్యాదు చేయాల్సిందిగా ప్రజలకు అవగాహన కల్పించాలని పోలీసు సిబ్బంది, మహిళా సంరక్షణ పోలీసులను జిల్లా ఎస్పీ ఆదేశించారు.పోలీసు సిబ్బంది సమస్యలను జిల్లా ఎస్పీ అడిగి తెలుసుకొని, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు.గంజాయి నియంత్రణకు చర్యలు చేపట్టాలని, మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్థాలను ప్రజలు, విద్యార్దులకు "సంకల్పం" కార్యక్రమంతో అవగాహన కల్పించాలని ఆదేశించారు.గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని, సీసీ కెమెరాల ఏర్పాటులో స్థానిక వ్యాపారులు, ప్రజలు, MSPల సహకారం తీసుకోవాలన్నారు.రోడ్డు ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్స్ వద్ద కాషనరీ బోర్డులను, స్టాపర్స్, లైటింగ్ ఏర్పాటు చేసి, ప్రమాదల నియంత్రణకు చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు.అనంతరం, పోలీసు స్టేషనులో నమోదై, దర్యాప్తులో ఉన్న కేసులు, వివిధ న్యాయ స్థానాల్లో ట్రయల్స్ లో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల సిడీ ఫైల్స్ ను జిల్లా ఎస్పీ పరిశీలించి, కేసుల దర్యాప్తు పూర్తి చేసేందుకు అధికారులకు దిశా నిర్దేశం చేసారు.స్టేషను పరిధిలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నేరాల నియంత్రణకు ఇన్ఫార్మర్ వ్యవస్థను మెరుగుపర్చుకోవాలని, సమాచార సేకరణకు MSP, దత్తత గ్రామ పోలీసుల సేవలను సమర్ధవంతంగా వినియోగించు కోవాలన్నారు.వివిధ స్టేషన్ రికార్డ్స్, జనరల్ డైరీ, పార్టు 1-5 రికార్డ్స్, హిస్టరీ షీట్స్, ప్రాసెస్ రిజిష్టరు, FIR ఇండెక్స్, KD చెక్ రిజిష్టరు, క్రైమ్ చార్ట్, క్రైమ్ ఆబ్స్ట్రాక్ట్, బీట్ బుక్స్ లను జిల్లా ఎస్పీ తనిఖీ చేసారు.ఈ వార్షిక తనిఖీల్లో రాజాం రూరల్ సిఐ హెచ్.ఉపేంద్ర రావు, ఎస్బి సిఐ ఏవి లీలారావు, వంగర ఎస్సై షేక్ శంకర్ మరియు ఇతర పోలీసు అధికారులు, MSPలు, దత్తత పోలీసులు పాల్గొన్నారు.