నేరాల నియంత్రణ, ప్రజల భద్రతకే సి.సి.కెమెరాల ఏర్పాటు||
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 28 డిసెంబర్
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం 2వ పట్టణ పోలీసు స్టేషను పరిధిలో నేర నియంత్రణ, ప్రజల భద్రతకు ఏర్పాటు చేసిన సి.సి.కెమెరాలను, వాటిని నిరంతరం పర్యవేక్షించేందుకు పోలీసు స్టేషనులో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూంకు కోర్టుమానిటరింగు సిస్టంను 2వ పట్టణ పోలీసు స్టేషనులో జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ డిసెంబరు 27న ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ - నేరాలను నియంత్రించుటలకు ప్రతీ ప్రాంతంలో సిసి కెమెరాలను ఏర్పాటు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదన్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలోఇప్పటికే 620 సి.సి.కెమెరాలను ఏర్పాటు చేసిందన్నారు. కానీ, స్థానిక అవసరాలకు అనుగుణంగా ప్రజల సహకారంతోమరికొన్ని సి.సి.కెమెరాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించామన్నారు. 2వ పట్టణ సిఐమరియు సిబ్బంది ఎంతో స్ఫూర్తితో స్థానిక ప్రజల సహకారంతో 38 సి.సి.కెమెరాలను 2వ పట్టణ పోలీసు స్టేషను పరిదిలోని 9 ప్రాంతాల్లో ఏర్పాటు చేసి, వాటిని పోలీసు స్టేషనులో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానంచేయడం అభినందనీయమని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు.ఒక సి.సి. కెమెరా 20మంది పోలీసులు చేసే పనిని చేస్తుందన్నారు. నేరాలు జరిగేందుకు అవకాశం ఉన్నప్రాంతాలపై నిరంతరం నిఘా పెట్టేందుకు, నేరాలను నియంత్రించుటలో సిసి కెమెరాలు ఉపయోగపడతాయన్నారు. ఈవ్ టీజింగు, గంజాయి అక్రమ రవాణ, దొంగతనాలు వంటి నేరాల కట్టడిలో సి.సి. కెమెరాలు, సాంకేతికతను వినియోగించుకొంటే మంచి ఫలితాలను సాధించవచ్చునన్నారు. సాధారణంగా జిల్లా లేదా సబ్ డివిజన్ స్థాయిలో కమాండ్ కంట్రోల్ఉంటుందని, కానీ, ప్రప్రధమంగా ఒక పోలీసు స్టేషను పరిధిలో నిఘా ఏర్పాటు చేసేందుకు కమాండ్ కంట్రోల్ ఏర్పాటుచేసి, ఇతర జిల్లాలకు సిఐ శ్రీనివాసరావు స్ఫూర్తిగా, మార్గదర్శకంగా నిలిచారని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ప్రశంసించారు. గత ఆరు మాసాలుగా జిల్లా పోలీసు యంత్రాంగం చక్కగా పని చేయడం వలన జిల్లాలో నేరాలు కూడా తగ్గుముఖం పట్టాయని,భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో పోలీసు అధికారులు, సిబ్బంది పని చేయాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు.విజయనగరం 2వ పట్టణ సిఐ టి.శ్రీనివాసరావు మాట్లాడుతూ - జిల్లా ఎస్పీగారి ఆదేశాలతో 2వ పట్టణ పోలీసుస్టేషనులో నివసిస్తున్న ప్రజలతో పలుమార్లు మమేకమై, నేరాలను నియంత్రించుటలోను, ప్రజలకు భద్రత కల్పించుటలోసి.సి.కెమెరాల ప్రాధాన్యతను వివరించడంతో, స్థానిక ప్రజలకు తమ ప్రాంతంలో సి.సి. కెమెరాలను ఏర్పాటు చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారన్నారు. ఇదే స్ఫూర్తితో రాబోయే 15 రోజుల్లోమరో 60 సి.సి.కెమెరాలను 15 ప్రాంతాల్లోఏర్పాటు చేసి, స్టేషనులోని కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానం చేస్తామని, నేరాలను నియంత్రిస్తామన్నారు.సిసి కెమెరాలను ఏర్పాటు చేయుటలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన దాతలను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ప్రత్యేకంగా అభినందించి, జ్ఞాపికలను ప్రధానం చేసారు. ఈ కార్యక్రమంలో విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు, 2వపట్టణ సిఐ టి.శ్రీనివాసరావు, ఎస్బీ సిఐ ఆర్.వి.ఆర్.కే. చౌదరి, విజయనగరం రూరల్ సిఐ బి.లక్ష్మణరావు, 2వ పట్టణ ఎస్ఐలు మురళి, కృష్ణమూర్తి, ఎఎస్ఐ పైడితల్లి, పోలీసు సిబ్బంది, ఎం.ఎస్.పి.లు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.