గంజాయి మరియు గ్రామాలలో నిషేధిత మత్తు పదార్థాలను నిరోధించుటకు కఠిన చర్యలు తీసుకోవాలి.

గంజాయి మరియు గ్రామాలలో నిషేధిత మత్తు పదార్థాలను నిరోధించుటకు కఠిన చర్యలు తీసుకోవాలి.

జనం న్యూస్ 17 అక్టోబర్ 2024. జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా. గొంగళ్ల రంజిత్ కుమార్,,నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్,,
జోగులాంబ గద్వాల
జిల్లాలో విస్తృతంగా గంజాయి
వ్యాపిస్తుందన్న వార్తల నేపథ్యంలో దీనిపై మరియు గ్రామాలలో నిషేధిత మత్తు పదార్థాల ను విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకొవాలని,ముఖ్యంగా యువత ఇలాంటి మత్తుకు దూరంగా ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా  సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా  గొంగళ్ళ రంజిత్ కుమార్ మాట్లాడుతూ......జిల్లాలో గంజాయి వ్యాపిస్తుందన్న వార్తల నేపథ్యంలో ప్రజలు బయోందోళనలకు గురవుతున్నారని వీటిపై ప్రజలకు భరోసా కల్పించుటకై తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు.గంజాయి లాంటి మత్తుకు అలవాటు పడ్డ యువత సమాజంలో అనేక రకాల అసాంఘిక కార్యక్రమాలకు కారణమవుతున్నారని వీటిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ విషయమై  ప్రజలను చైతన్యపరచాలని ఒకరోజు నిరాహార దీక్ష చేయడం జరిగిందని,ఎవరికైనా ఎక్కడైనా అనుమానస్పద రీతిలో యువత కనపడితే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని అన్నారు.రాజకీయాలకు తావులేకుండగా పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ జిల్లాను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని అన్నారు.గ్రామాలలో కల్తీ కల్లు స్వైర విహారం చేస్తున్నదని,ఆల్ఫ్రాజోలం,సిహెచ్, డైజోఫాం లాంటి నిషేధిత మత్తు పదార్థాలను కల్లు లో  కలుపుతున్నారని దీనిపై కూడా సంబంధిత  ఎక్సైజ్ శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.దీని విషయమై త్వరలో నార్కోటిక్ డిపార్ట్మెంట్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. పాలకులు ఇట్లాంటివాటిని ప్రోత్సహించకుండా,ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారు తమ వారైనా ఉపేక్షించేవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ బుచ్చిబాబు నాయకులు లవన్న, శ్రీనివాస్ యాదవ్, విష్ణు,ప్రేమ్ రాజ్,రంగస్వామి, మల్దకల్,అడవి ఆంజనేయులు,రాముడు, రాజు,శాంతన్న,భూపతి,వీరేష్ జమ్మన్న, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.