జనసైనికుల కు అండగా జన సేన

జనసైనికుల కు అండగా జన సేన

ప్రతి కార్యకర్తకు గుర్తింపు... 
మృతి చెందిన జన సైనికులకు  మంత్రి నాదెండ్ల మనోహర్ చెక్కులు పంపిణీ.... 
జనం న్యూస్ 08 డిసెంబర్
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక జన సై నికులకు అండగా జన సేన ఉంటుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్య క్రమం లో మృతి చెందిన కుటుంబాలకు 5' లక్షల రూపాయల చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో కార్యకర్తలే ముఖ్యం అని గత వైసిపి పాలన లో జెండా మోసి ఎన్నో అవమానాలు, కేసులు తట్టుకుని పార్టీ కోసం పని చేయడం నిలబడి గర్వకారణం అన్నారు. పార్టీ లో ప్రతి జన సైనికుడి నీ అదుకోవాలని సభ్యత్వాలు ద్వారా ఆ దుకుంటున్న పార్టీ జన సేన అన్నారు. 2021 లో సభ్యత్వం ప్రా రంభించి నేడు 10 లక్షల సభ్యత్వాలు కు చేరుకుందని తెలిపారు. మార్పు కోసం అంతా ఎదురు చూసి రాక్షస ప్రభుత్వాన్ని లేకుండా చేశారనీ అన్నారు. కూటమి లో ఉంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని ఎవ్వరూ కూటమి కి వ్యతిరేకంగా వ్యవహరించ కూడదని సూచించారు.నిజాయితీ గల రాజకీయం పవన్ కళ్యాణ్ చేస్తున్నారని అందుకు అంతా సహకరించాలన్నారు. తన శాఖ ద్వారా సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటున్నాననితెలిపారు.చిన్న చిన్న మనస్పర్థలు , కమ్యునికేషన్ గ్యాప్ లు ఉంటే అర్థం చేసుకుని సర్దుకు పోవాలని ప్రతి ఒక్కరికీ ఒక రోజు తగిన గుర్తింపు లభిస్తుందని అన్నారు. మృతి చెందిన కార్య కర్తల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చెక్కులు అందజేశారు. ఈ కార్య క్రమం లో శ్రీకాకుళం, విజయనగరం ఉమ్మడి జిల్లా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు