వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తోకంలో అలసత్వాన్ని సహించేది లేదు.?..తాసిల్దార్
వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలోని వరి ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించిన తాసిల్దార్ నజీమ్ ఖాన్,
జనం న్యూస్,నవంబర్ 05,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్,జంమ్గి కె,వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం ఎమ్మార్వో నజీమ్ ఖాన్,డిప్యూటీ ఎమ్మార్వో జుబేర్, సందర్శించారు.ఈ సందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ రైతులు చెమటోడ్చి పండించిన వరి ధాన్యాన్ని తగిన మోతాదులో తేమా శాతం వచ్చిన ధాన్యాన్ని వెనువెంటనే తూకం నిర్వహించి,రైస్ మిల్ లకు పంపించాలని సీసీలకు ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వరి ధాన్యాన్ని ఒక బస్తాకి 41 కిలోల తూకం చేపట్టాలని అన్నారు.ఏఈఓ హన్మడ్లు,భార్గవ్,కు రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తూకం క్రమసంఖ్య రసీదు రాసి ఇవ్వాలని అన్నారు.అనంతరం వరి కొనుగోలు కేంద్రంలోని వరి ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించారు. తగిన మోతాదులో తేమ శాతం వచ్చిన వరి ధాన్యాన్ని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తూకం చేపట్టాలని అన్నారు.ఈ కార్యక్రమంలో రికార్డు అసిస్టెంట్ గుండు మోహన్,సిసి అనసూయ,సిఏ రాజు, సిఏ సుమా దేవి, రైతులు,తదితరులు పాల్గొన్నారు.