తిరుపతిలో దారుణం చెట్టుకు కట్టేసి ప్రియురాలి పై అత్యాచారం చేసిన ప్రియుడి స్నేహితుడు.
జనం న్యూస్: తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండల పరిధిలోని దామరాయ గ్రామ పరిసరాల్లో మంగళవారం రాత్రి ప్రేమికుడిని కట్టేసి, ప్రియురాలిపై ఒక వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు వారికి తెలిసిన వ్యక్తే కావడం గమనార్హం. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన యువతి, యువకుడు ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ, కొన్నాళ్లుగా సహజీవనం సాగిస్తున్నారు. ఆ యువకుడికి ఏడుమలై, బాలాజీ అనే స్నేహితులు ఉన్నారు. మంగళవారం ఉదయం ఏడుమలై, ఆ యువకుడు సూళ్లూరుపేటలో మద్యం తాగారు. మళ్లీ రాత్రి ఏడుమలై ఆ యువకుడికి ఫోన్ చేసి నీ ప్రియురాలి జన్మదినం సందర్భంగా ఆమెను తీసుకుని కొరిడి శివాలయం వద్దకు వెళ్దామని నమ్మబలికాడు. కంపెనీలో పనికి వెళ్లిన ప్రియురాలి కోసం ఆ యువకుడు సూళ్లూరుపేటలోని వైజంక్షన్ వద్ద వేచి ఉండగా ఏడుమలై, బాలాజీ వచ్చారు. కొంతసేపటికి ఆమె రావడంతో అందరూ కలిసి బయలుదేరారు. పులికాట్ తీరంలోని దామరాయ పరిసరాల్లోకి వెళ్లగానే ఏడుమలై, బాలాజీ కలిసి ఆ యువకుడి చొక్కా విప్పి, దాంతోనే అతణ్ని కట్టేశారు. బాలాజీ కాపలాగా ఉండగా ఏడుమలై యువతిని (20) బెదిరించి అత్యాచారం చేశాడు. వారి వద్ద నుంచి నగదు, సెల్ఫోన్ లాక్కుని పారిపోయారు. బాధితులు కుటుంబసభ్యులతో కలిసి శ్రీహరికోట పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు.