దమ్మున్న నాయకులు దుమ్ము రోడ్డు పరిశీలన
-భీమారం మండలo కాంగ్రెస్ నాయకులు
జనం న్యూస్ 14 డిసెంబర్ భీమారం మండల ప్రతినిధి (కాసిపేట రవి )=-
భీమారం మండలం శనివారం రోజున కాంగ్రెస్ పార్టీ నాయకులు బూనేని సుధాకర్ , కోట రమేష్ కుక్కల నరేష్ లు మంచిర్యాల - జగదల్పూర్ జాతీయ రహదారి లో జోడువాగు వంతెనని పరిశీలించారు.
గత పది సంవత్సరాల కాలంలో గత పాలక ప్రభుత్వ ఎమ్మెల్యేలు , మంత్రులు నియోజకవర్గ కేంద్రానికి వచ్చిన సందర్భాలు ఉన్నాయ్ కాని ప్రజలకిఅవసరం అయినా పనులను చేయలేక ప్రజలను మభ్యపెట్టారు.
కాని
కాంగ్రెస్ పార్టీ హయం లో గడ్డం వివేక్ వెంకటస్వామి , గడ్డం వంశీకృష్ణ ఆధ్వర్యంలో చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధి కి జోడువాగు నిర్మాణం వారి కృషికి సంకేతం అని తెలిపారు.
తెలంగాణ - మహారాష్ట్ర ప్రజలకి ఎంతో వాణిజ్య పరంగా ముఖ్యమైన వంతెన దీనికి కృషి చేసిన గడ్డం వంశీకృష్ణ, భీమారం మండల ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు. తెలిపారు