విద్యార్థుల సమస్యలను పరిష్కరించని ప్రజా పాలన ప్రభుత్వం-ఎస్ఎఫ్ఐ పట్టణశాఖ
ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు చింతల శివ
జనంన్యూస్ అక్టోంబర్ 21భువనగిరి/యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేస్తుందని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు చింతల శివ అన్నారు. సోమవారం ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశం పట్టణ అధ్యక్షులు ఈర్ల రాహుల్ అధ్యక్షతన నిర్వహించామని తెలిపారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు విద్యారంగ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యారంగ సమస్యలు ఎందుకు పట్టించుకోవడంలేదని ఆయన ప్రశ్నించారు. పెండింగ్ లో ఉన్న ఉపకార వేతనాలను మూడు సంవత్సరాలుగా విడుదల చేయని కారణంగా విద్యార్థులే, యాజమాన్యాల కళాశాలల బందును చేసే పరిస్థితి తెలంగాణలో దాపరించిందని తెలిపారు. స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు చదువుకు దూరమవుతున్న పరిస్థితి ఉన్నదని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ గురుకులాలు సంక్షేమ హాస్టల్ అద్దేలు చెల్లించడం లేదని గురుకుల తాళం వేసి నిరసన తెలిపిన పరిస్థితి ఉన్నదని అన్నారు. 9 నెలలు గడుస్తున్నా రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేకపోవడంతో విద్యారంగ సమస్యలను ఎవరికి చెప్పాలో అర్థం కావడం లేదని వారు విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల గోడును వినేది ఎవరని వారు ప్రశ్నించారు. పెండింగ్ లో ఉన్న 8000 కోట్లు వెంటనే ప్రభుత్వం స్పందించి విడుదల చేయాలని లేని పక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు భవాని శంకర్, సతీష్, చింటూ పాల్గొన్నారు.