నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ.
మాచర్ల డిసెంబర్ 31(జనం న్యూస్) :- మాచర్ల పట్టణంలోని స్ధానిక కృష్ణవేణి టాలెంట్ స్కూల్ నందు ఘణంగా ముందస్తు నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టణ మండల విద్యాశాఖాధికారి ఏ.సురేష్ ,ఏపీయూడబ్ల్యూజే స్టేట్ కౌన్సిలర్ నెంబర్ వి.మురళీ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ రాబోవు నూతన సంవత్సరం అందరికి శుభ ఫలితాలను అందించాలని ఆకాంక్షించారు.అనంతరం కృష్ణవేణి టాలెంట్ స్కూల్ కు చెందిన 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు.స్కూల్ ప్రిన్సిపాల్ హనుమంతరావు,యాజమాన్యం వారు రామకృష్ణ , శ్రీధర్ గుప్తా,డాక్టర్ శివ, హరిష్ చంద్ర మాట్లాడుతూ ప్రతి సంవత్సరం చిన్నారి విద్యార్థుల యాక్టివిటీస్,విషయ పరిజ్ఞానానికి సంబంధించిన సమాచారంతో కూడిన క్యాలెండర్లను రూపొందించడం ఆనవాయితీ వస్తుందన్నారు.కొత్త ఏడాదిలో టెన్త్ క్లాస్ విద్యార్థులు చక్కటి ఫలితాలు సాధించాలన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.అనంతరం కేక్ కట్ చేసి, నూతన సంవత్సర క్యాలెండర్స్ ను స్టూడెంట్స్,పేరేంట్స్ కు అందచేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, యాజమాన్యం వారు, స్కూల్ ఇన్చార్జి లు
గౌరీ, నాగజ్యోతి, శ్రీ లక్ష్మీ రెడ్డి, పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు అంజయనాయక్.విద్యార్ధిని విద్యార్ధులు మరియు వారి తల్లితండ్రులు పాల్గొన్నారు.