దుర్గి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉచిత డెన్టల్ క్యాంపు
దుర్గి డిసెంబర్ 31 ( జనం న్యూస్) సోమవారం ది.31-12-2025 న దుర్గి మండల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రోటరీ క్లబ్ మాచర్ల వారి ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థినీ, విధ్యర్థులకు డెన్టల్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కె రామకోటయ్య , డిస్ట్రిక్ట్ డిప్యూటీ గవర్నర్ డాక్టర్ కె లలిత్ కిరణ్ , డాక్టర్ శ్రీమతి పి శ్వేత , పల్నాడు జిల్లా రోటరీ క్లబ్ కార్యదర్శి నాగూర్ వలి పాల్గొన్నారు. ప్రిన్సిపాల్ కె వేణు అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్య్రమంలో యన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఆర్ వి ఎస్ ప్రసాద్ యూనిట్ -1 నుంచి శ్రీమతి యం వహిని యన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ యూనిట్ -2 మరియు ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు.