ప్రజాబిష్టం మేరకే కోర్టు సముదాయంను ఏర్పాటు చేయాలి
జనం న్యూస్ 30 డిసెంబర్ 2024 జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా న్యాయవాదుల దీక్షకు సంపూర్ణ మద్దతు.బిఎస్పీ జిల్లా అధ్యక్షులు ఆకేపోగు రాంబాబు.జోగులాంబ జిల్లా కేంద్రం ::-ప్రజాభిప్రాయం మేరకే కోర్టు సముదాయాన్ని ఏర్పాటు చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపోగు రాంబాబు అన్నారు. ప్రభుత్వం యొక్క ఏకపక్ష నిర్ణయం సరికాదని ఈ సందర్భంగా ఆయన అన్నారు. గత 13 రోజుల నుండి జిల్లా కేంద్రంలోని కోర్టు ముందు నిరసన వ్యక్తం చేస్తున్న న్యాయవాదుల దీక్షకు ఆయన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో ఉన్న ప్రస్తుత కోర్టు ప్రాంగణాన్ని ఇతర ప్రాంతాలకు తరలించడం సరికాదన్నారు. జిల్లా ప్రజల ప్రజాభిప్రాయం లేకుండా కోర్టు సముదాయాన్ని ఇతర ప్రాంతాలకు ఎలా తరలిస్తారని ఈ సందర్భంగా ఆయన అన్నారు. జిల్లా ప్రజలకు అనుకూలంగా ఉండేటట్లు పిజెపి క్యాంపులో జిల్లా కోర్టు సముదాయాన్ని ఏర్పాటు చేయాలన్నారు. అనంతపురం శివారులో కోర్టు సముదాయాన్ని ఏర్పాటు చేస్తే ప్రజలకు ప్రతికూలతలే గాని సౌకర్యవంతంగా ఉండదన్నారు. భారత రాజ్యాంగంలో మూల స్తంభమైన జ్యుడీషియరిని తరలించే ముందు ప్రజాభిప్రాయ సేకరణ తప్పకుండా ఉండాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ప్రజాస్వామ్యం అంటే ప్రజలే అంతిమ నిర్ణేతలని.. ప్రజల ఇష్టం మేరకు పనులు జరగాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా స్పందించి కోర్టు సముదాయాన్ని పిజెపి క్యాంప్ లో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సంఘీభావం తెలిపిన వారిలో బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మణికుమార్, ఇటిక్యాల మండల ప్రధాన కార్యదర్శి సికిందర్ బాబు, మల్దకల్ మండల ప్రధాన కార్యదర్శి రామ్ పోగు నరేష్ కుమార్, సోంపురం దేవన్న,గుడెదొడ్డి రాఘవేంద్ర, సంగాల గ్రామానికి చెందిన ఆకేపోగు నగేష్, ఇటిక్యాల రామకృష్ణ మరియు కార్యకర్తలు లు పాల్గొన్నారు.