- ప్రతి పక్ష పార్టీ నాయకులు అభివృద్ధి కి సహకరించండి

- ప్రతి పక్ష పార్టీ నాయకులు అభివృద్ధి కి సహకరించండి

- కల్లూరు మీడియా సమావేశంలో ఏఎంసీ మహిళా చైర్మన్ నీరజ


జనం న్యూస్ కల్లూరు/ఖమ్మం జిల్లా బ్యూరో డిసెంబర్ 6 : 
 గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీలను నెరవేర్చక పోగా సామాన్య ప్రజలను విస్మరించింది టిఆర్ఎస్ ప్రభుత్వం కాదా ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించటం మీకు తగునా ఏడాది కాలంలో జరిగిన అభివృద్ధి పై ప్రజా పాలన విజయోత్సవాలు నిర్వహించుకుంటుంటే ఓర్వలేక అసూయతో ప్రభుత్వం పై బురద చల్లుతున్నారని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య చేసిన వ్యాఖ్యలపై కల్లూరు వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఎంసీ చైర్మన్ భాగం నీరజాదేవి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఏనుగు సత్యంబాబు, అన్నారు ఈ సందర్భంగా  మాట్లాడుతూ ఆరు గ్యారంటీలామీతో అమలులోకి అదికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు గ్యారంటీలను పూర్తిచేసుకుని ఆరవ గ్యారెంటీ ఇందిరమ్మ ఇళ్ళకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలియదా అన్నారు  ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో  దళితులకు మూడు ఎకరాలు ఇస్తానని ఇచ్చారా పది సంవత్సరాల పాలనలో ఒక్క తెల్ల రేషన్ కార్డు అందించారా ఆసరా కోసం ఎదురుచూసిన వితంతువులు దివ్యాంగులకు భరోసా ఎక్కడ కల్పించారు కుటుంబ పోషణ కోసం వ్యవసాయ కూలీలు కౌలుదారులుగా మారితే పదేండ్లలో వాళ్లకి ఇచ్చిన గౌరవం ఏంటి అబాస్ పాలు చేయడం తప్ప డబుల్ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు   నాసిరకంగా నిర్మాణాలు చేస్తిరి, ఏడాది తిరక్క ముందే మోకాళ్ళ లోతు నీళ్లు నిలిచే ఇదేనా మీరు చేసిన అభివృద్ధి రుణమాఫీ పై ప్రశ్నించే మీకు లెక్కలతో సహా వివరించేందుకు ప్రభుత్వం తరఫున మేము సిద్ధమని  అన్నారు రెండు లక్షల పైన దాటిన వారికి సాంకేతిక లోపాల కారణంగా కొంతమందికి రాకపోయి ఉండొచ్చు గానీ రుణమాఫీ చేయలేదనటం సమంజసం కాదని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం శాశ్వత పరిష్కారాల వైపు పనిచేస్తుందని బిఆర్ఎస్ ప్రభుత్వం లాగా ఈ పథకమైన ఈ కార్యకర్తల కోసమే చేసినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చేయదని అన్నారు మిగులు బడ్జెట్తో రాష్ట్రాన్ని అప్పచెపితే లక్షల కోట్ల అప్పులతో సూపించి అభివృద్ధి చేయలేదనటం సంవత్సరం టైం ఇచ్చామంటూ గొడుగులు విధించడం సీనియర్ నాయకుడుగా మీకు తగునా అన్నారు రాజకీయంలో రాజకీయంలో అధికారం సహజమే అని కానీ అహంకార స్వభావం దురదృష్టకరం అన్నారు  ఫుడ్ పార్క్ ప్రారంభోత్సవం గురించి ప్రస్తావిస్తూ తుమ్మలను తప్పు పట్టే అర్హత మీకుందా అని అన్నారు ఏ పార్టీలో ఉన్న ప్రజా సంక్షేమం కోసం పనిచేయటమే ఆయన అంతిమ ధ్యేయమని నీకు తెలియదా అని  అన్నారు ఎంతో రాజకీయ అనుభవం ఉన్న ఆయనకు ప్రోటోకాల్ విలువలు తెలియవా దాని గురించి మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ సొరవతో నియోజకవర్గంలో 60 రోజుల్లో దాదాపు 130 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగితే అని అన్నారు నియోజవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి అభివృద్ధి జరిగిందో లేదో అప్పుడే విమర్శించండి ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగబత్తిని నగేష్ కె.వి.ఆర్, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ పరిమి భరత్ మండల యూత్ అధ్యక్షులు ఆళ్లకుంట నరసింహారావు వేణుగోపాలస్వామి ఆలయ కమిటీ చైర్మన్ దార రంగ, భాగం ప్రభాకర్ చౌదరి  మట్టా రామకృష్ణారెడ్డి శ్రీనివాసరావు మర్సకట్ల బాలశౌరి మచ్చ వెంకటేశ్వరరావు బత్తుల రాము యాస శ్రీకాంత్ బైర్ల కాంతారావు ఏనుముల రాము ఉబ్బెన శ్రీనివాసరావు బాజీ తదితరులు పాల్గొన్నారు