బాల్రెడ్డి పల్లె పంచాయతీ లో ఎంసీఏ బుల్లయ్య సూచనలు సలహాలు
ఓబులవారిపల్లి మండలం ప్రకృతి వ్యవసాయం చేసే సిబ్బంది ఎంసిఏ బుల్లయ్య ఈరోజు బాల్రెడ్డి పల్లె పంచాయతీలో రైతు కొత్తపు ఓబుల్ రెడ్డి ప్రధాన పంట అరటి అంతర్ పంటగా బంతి వంగ టమోటా వెల్లుల్లి మిరప బోర్డర్ క్రాపు కంది ఆముదము వల్ల కొంత వరకు తెగుళ్లును అరికట్టవచ్చు ఈ రైతు వేయడం జరిగినది ఈ పంటకు జీవామృతం ఈరోజు రైతుతో చేపించడం జరిగినది శనగపిండి అరటి పండ్లు నాటు ఆవు మూత్రము నాటావు పేడ పిరికెడు పుట్టమట్టి 200 లీటర్ల నీళ్లు చేయడం జరిగినది బాల్రెడ్డిపల్లి ప్రతి రైతు కూడా జీవామృతం ఏ విధంగా చేసుకోవాలని రైతులకు చూపించటం జరిగినది దీనివల్ల కొన్ని సూక్ష్మజీవులు ఉంటాయి. జీవామృతం వల్ల పంటలకు పోషకాలు అందిస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఇదే విధంగా చేయాలని సూచిస్తున్నాము అంతర పంట వల్ల ప్రధాన పంట పెట్టుబడిని జీరో బడ్జెట్ గా ప్రకృతి వ్యవసాయంలో చేయవచ్చు ప్రతి రైతు కూడా ప్రకృతి వ్యవసాయంలో ఐ సి ఆర్ పి రత్నమ్మ సూచనలు సలహాలు ఎంసీఏ బుల్లయ్య ఇవ్వడం జరిగినది