రేపు పూడిమడక గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టు శంకుస్థాపన*
*విశాఖపట్నం ప్రధాని నరేంద్ర మోడీ రాక*
అచ్యుతాపురం(జనం న్యూస్):అనకాపల్లి జిల్లా పూడిమడకలో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తోంది. జనవరి 8వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయడానికి విశాఖపట్నం వస్తున్నారు.గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టు ఏర్పాటు చేసే స్థలం దగ్గర వేదిక సిద్ధం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో 2 లక్షల కోట్ల రూపాయలతో -
మనదేశంలో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ 2021లో ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టు ద్వారా 2030 నాటికి ఏడాదికి అయిదు మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయాలనేది లక్ష్యం.
పూడిమడకలోని 1600 ఎకరాల్లో రాబోతున్న ఈ ప్రాజెక్టు గ్రీన్ ఎనర్జీ పవర్‌హౌస్ అవుతుందని, ఈ ప్రాజెక్టుతో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో ప్రపంచ అగ్రగామిగా భారత్ మారుతుందని కేంద్రం చెబుతోంది.