బహిరంగ సభకు తరలిరావాలి*
అచ్యుతాపురం(జనం న్యూస్):ప్రధాని మోడీ విశాఖపట్నం పర్యటన పై అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం వెంకటాపురం జనసేన పార్టీ కార్యాలయంలో
కూటమి నేతలు సమావేశం నిర్వహించారు. ఈనెల 8వ తేదీన విశాఖలో జరగనున్న ప్రధాని మోదీ రోడ్ షో, బహిరంగ సభకు ఎలమంచిలి నియోజకవర్గం నుంచి భారీగా హాజరు అయ్యేలా కూటమి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఎలమంచిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ ప్రగడ నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.మోడీ సభకు బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని, అధికారుల సమన్వయంతో కార్యచరణ ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ఈ సమావేశంలో నరేంద్ర మోడీ కార్యక్రమం ఇన్చార్జి ఎమ్మెల్యే కొత్తపేట బండారి సత్యానంద,
మున్సిపల్ చైర్పర్సన్ రమా కుమారి,మాజీ చైర్ పర్సన్ లాలం భవాని భాస్కర్, దూళి రంగనాయకులు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.