.......*వేజ్ బోర్డ్ మెంబర్ గా బసాని చంద్ర ప్రకాష్ ప్రమాణస్వీకారం*
జనం న్యూస్ జనవరి 7 శాయంపేట మండలం రాష్ట్ర మినిమం వేజెస్ అడ్వైజరి బోర్డు మెంబర్ గా మాజీ ఎంపీపీ బాసని చంద్రప్రకాష్ సోమవారం హైదరాబాదులో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం చంద్ర ప్రకాష్ ను చేనేత వస్త్రంతో సన్మానించి, శుభాకాంక్షలు తెలియ చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు దుదిపాల బుచ్చిరెడ్డి కార్మికుల సంక్షేమానికి పాటుపడాలని, వారికి అండగా ఉండాలని చంద్ర ప్రకాష్ ను కోరారు. అలాగే చంద్రప్రకాష్ నియామకానికి సహకరించిన స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి చల్లా చక్రపాణి, పరకాల ఏఎంసి వైస్ చైర్మన్ మారపల్లి రవీందర్, డైరెక్టర్ శానం కుమారస్వామి, నాయకులు పోలపల్లి శ్రీనివాస్ రెడ్డి రఘుపతి రెడ్డి అబ్బు ప్రకాశ్ రెడ్డి చిందం రవి, వైనాల కుమారస్వామి, కందగట్ల రవి, దుబాసి కృష్ణమూర్తి, మారపల్లి కట్టయ్య, రాజేందర్, వరదరాజు, మార్కండేయ, వీరన్న, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.....