:-షాద్ నగర్ లో జరిగే లంబాడిల మహా గర్జన కు తరలిరావాలి!
*ఎల్ హెచ్ పి యస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందర్ నాయక్ పిలుపు!*
నవాబుపేట జనం న్యూస్ :-లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో లంబాడీలు మాట్లాడే భాష గోర్ బోలి ని రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఈనెల 29న షాద్ నగర్ పట్టణంలోని సాయి రాజ ఫంక్షన్ హాల్ లో లంబాడీల మహా గర్జన నిర్వహిస్తున్నట్లు లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విస్లావత్ చందర్ నాయక్ తెలిపారు.నెల రోజులపాటు షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని ఫరూక్ నగర్, కొత్తూర్,నందిగామ,కేశంపేట్, కొందుర్గు,జిల్లేడు చౌదరి గూడెం మండలాలతోపాటు షాద్ నగర్ టౌన్ ఎల్ హెచ్ పి ఎస్ నూతన కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని వారు అన్నారు. రాబోవు రోజుల్లో అన్ని తాండాల కమిటీలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని వారు తెలిపారు. అన్ని మండలాలలో గల తాండాలలో లంబాడీలు మాట్లాడే భాష గోర్ బోలి ఆవశ్యకత గురించి ప్రచారం చేయడం జరిగిందని అన్నారు. గోర్ బోలితో పాటు తాండాలకు కావలసిన మౌలిక వసతుల సాధన గురించి లంబాడీలకు ప్రచారం చేయడం జరిగిందని వారు అన్నారు. తాండాలలో ఉన్న యువకులు విద్యా,ఉద్యోగ రాజకీయ రంగాలలో ముందుండాలని వారికి అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు. లంబాడీల గర్జనకు ముఖ్య అతిథులుగా లంబాడి హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు,తెలంగాణ ట్రైకార్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్,రాష్ట్ర అధ్యక్షులు మూడవత్ రాంబల్ నాయక్ లతో పాటు జాతీయ,రాష్ట్ర జిల్లాల నాయకులు పాల్గొంటారని వారు తెలిపారు.కావున అన్ని మండలాల లంబాడి విద్యావేత్తలు,యువకులు మహిళలు,విద్యార్థులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చందర్ నాయక్ కోరారు