సొంత బిల్డింగ్ లేకపోతే చదివేదెల...
జనం న్యూస్ 13 డిసెంబర్
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్.ఎఫ్.ఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వద్ద నిరసన తెలియజేయడం జరిగింది. కార్యక్రమం లో భాగంగా బిల్డింగ్ సదుపాయం లేకపోతే భవిష్యత్తులో మా చదువు పుట్‌పాత్ మీద చదవల్సిన పరిస్థితి వస్తుందని తెలియజేస్తూ అక్కడే పుస్తకాపటన చేశారు.ఈ కార్యక్రమం లో భాగంగా జిల్లా సహాయ కార్యదర్శి పి రమేష్ మాట్లాడుతూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్.ఎఫ్.ఐ పోరాట ఫలితంగా 2019లో విజయనగరం పట్టణానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకొచ్చిందని, అయితే దాదాపుగా ఐదు సంవత్సరాలు కళాశాల ప్రారంభమైనప్పటికీ సొంత బిల్డింగ్ లేకపోవడం దారుణమైన పరిస్థితని దాదాపుగా ప్రతి సంవత్సరం నాలుగు వందలకు పైగా విద్యార్థులు కళాశాలలో చేరుతున్న భవనం కూడా కేటాయించకపోవడం అనేది ప్రభుత్వం విద్యార్థులు పక్షాన మొండివైఖరి చూపుడమేనని, ఈరోజు సాంస్కృతిక డిగ్రీ కళాశాలలో, ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు క్లాసులు నిర్వహిస్తున్నారు. అయితే రెండు కళాశాలలు ఒకే భవనంలో ఉండడంతో పూటకు ఒక కళాశాల చొప్పున తరగతులు నిర్వహించడం జరుగుతుంది. ఇలా అయితే బయట విద్యార్థులతో ఈరోజు ప్రభుత్వం మీద నమ్మకంతో ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న పేద విద్యార్థులు ఏ విధంగా పోటీ పడగలరని సొంత బిల్డింగ్ ఏర్పాటు చేస్తే రెండు పూటలా చదువుకొని భాహ్య విద్యాలోకంతో ముందుకు సాగుతారని అయితే పర్మినెంట్ బిల్డింగ్ ఏర్పాటు చేసే లోపు తాత్కాలికంగా ఖాళీగా ఉన్న భవంతులలో క్లాసులు నిర్వహించేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని. ఈరోజు ఆర్&బి భవనం లో కళాశాల నడుపుటకు వీలు ఉందని. అలాగే మహారాజా కళాశాల (పోర్ట్ )క్యాంపస్ లో భవనాలు ఖాళీగా ఉన్నాయి ఇవి కూడా తరగతిలు నిర్వహించేందుకు ఉపయోగపడతాయని కావున తాత్కాలికంగా వీటిల్లో తరగతులు నిర్వహించి సొంత బిల్డింగ్ ఏర్పాటుకై ప్రభుత్వం కృషి చేయాలని ఎస్ఎఫ్ఐ నిరసన తెలియజేస్తున్నాం. లేనియెడల విద్యార్థులను, ప్రజలను ఐక్యం చేసి పెద్ద ఎత్తున పోరాటాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్ష కార్యదర్శులు జి.సూరిబాబు, కె.రాజు మరియు పట్టణ నాయకులు జయ, రాహుల్, సుస్మిత మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు...