హత్య మరియు అట్రాసిటీ కేసులో నిందితునికి జీవిత ఖైదు

హత్య మరియు అట్రాసిటీ కేసులో నిందితునికి జీవిత ఖైదు

- విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఐపిఎస్.
జనం న్యూస్ 13 డిసెంబర్
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం 1వ పట్టణం పోలీసు స్టేషనులో 2024 సంవత్సరంలో నమోదైన హత్య మరియు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో నిందితుడైన విజయనగరం పట్టణం ఎరుకులపేట జొన్నగుడ్డికి చెందిన వారణాసి సూర్యనారాయణ (42సం.లు)కు విజయనగరం ఎస్సీ మరియు ఎస్టీ కోర్టు కోర్టు జడ్జి శ్రీ బి.అప్పలస్వామి గారు జీవితఖైదు మరియు రూ.1,000/-లు జరిమాన విధిస్తూ డిశంబరు 12న తీర్పు వెల్లడించినట్లుగా విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం పట్టణం, ఎరుకులపేట జొన్నగుడ్డి ప్రాంతానికి చెందిన వారణాసి సూర్యనారాయణ (42 సం.లు) అనే వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన కామేశ్వరి అనే ఆమెను కులాంతర వివాహం చేసుకొని జీవనం సాగించారు. వారికి ఒక పాప జన్మించినట్లు, కొన్నాళ్ళు కలిసి ఉన్న తరువాత తన భర్త మద్యానికి బానిసై త్రాగి వచ్చి ఆమెను అనుమానిస్తూ, శారీరకంగా మానశికంగా వేధిస్తున్నందున తన బిడ్డతో కలిసి వేరే ఇంటిలో అద్దెకు ఉంటున్నారు. ఇదిలా ఉండగా తే. 15-05-2024 ది రాత్రి తన తండ్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చి తన తల్లిపై కత్తితో దాడి చేసి గాయపరచగా విజయనగరం 1వ పట్టణ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చెయ్యగా, హత్యాయత్నం మరియు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసారు. తరువాత తన తల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించగా హత్య నేరం క్రింద విజయనగరం 1వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అప్పటి విజయనగరం డిఎస్పీ ఆర్.గోవిందరావు దర్యాప్తు చేపట్టి, నిందితుడిని అరెస్టు చేసి, కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేసారన్నారు. నిందితుడు వారణాసి సూర్యనారాయణపై నేరం రుజువు కావడంతో విజయనగరం ఎస్సీ మరియు ఎస్టీ కోర్టు జడ్జి శ్రీ బి.అప్పలస్వామి జీవిత ఖైదు మరియు రూ.1000/-ల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారన్నారు. ఈ కేసులో నిందితుడిపై నేరం నిరూపణ అయ్యే విధంగా పోలీసువారి తరుపున పబ్లిక్ ప్రాసిక్యూటరు శైలజ వాదనలు వినిపించగా, ప్రస్తుత విజయనగరం 1వ పట్టణ సిఐ ఎస్.శ్రీనివాస్ పర్యవేక్షణలో కోర్టు ఆదేశాల కానిస్టేబులు త్రిమూర్తులు సాక్షులను సకాలంలో కోర్టులో హాజరుపర్చారన్నారు. కేసులో త్వరితగతిన నిందితుడికి శిక్షపడే విధంగా వ్యవహరించిన దర్యాప్తు అధికారులు, ప్రాసిక్యూషన్ అధికారులను, కోర్టు లైజన్ ఆఫీసరు మల్లేశ్వరరావులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఐపిఎస్ అభినందించారు.