*మధ్యాహ్న భోజన కార్మికులు జీతాలు పెంచాలి.*

*మధ్యాహ్న భోజన కార్మికులు జీతాలు పెంచాలి.*

జనం న్యూస్ 04 నవంబర్

విజయనగరం టౌన్ రిపోర్టర్

గోపికృష్ణ పట్నాయక్

మధ్యాహ్న భోజన కార్మికులకి జీతాలు పెంచి వారి సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ఉదయం ఆంధ్రప్రదేశ్ మధ్యాహ్న భోజన నిర్వాహకులు సంఘం ( ఎఐటియుసి అనుబంధం) ఆధ్వర్యంలో ఎఐటియుసి జిల్లా కార్యదర్సులు డేగల అప్పలరాజు, పురం అప్పారావు ల నేతృత్వంలో విజయనగరం జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్ డా బి ఆర్ అంబేద్కర్ గార్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. 

ఈ ధర్నాలో ముఖ్య అతిథిగా హాజరైన ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులు చాలీచాలని వేతనాలతో కుటుంబాలను పోషించుకుంటూ తీవ్రమైన ఇబ్బందులు అనుభవిస్తున్న ఎన్ని ప్రభుత్వాలు మారినా కానీ వాళ్ళకి న్యాయం జరగడం లేదని మండిపడ్డారు. మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకు ప్రస్తుతం ఇస్తున్న మెస్చార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఓ పక్కన నిత్యవసర వస్తువులు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నందువల్ల ప్రభుత్వం ఇస్తున్నటువంటి మెస్ ఛార్జీలు చాలా తక్కువగా చెల్లించకపోవడం వలన నిర్వాహకులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు అని అన్నారు. ప్రాథమిక పాఠశాలకు 20 రూపాయలు, ఉన్నత పాఠశాలకు 30 రూపాయలు మెస్ ఛార్జీలు పెంచాలని ఎఐటియసి డిమాండ్ చేస్తుందన్నారు. వంట నిర్వాహకులు సుమారు పాఠశాలలో ఆరు గంటల సమయం పని చేస్తున్నారు ప్రస్తుతం ఇస్తున్న గౌరవ వేతనం చాలడం లేదు కాబట్టి వారికి కనీస 10,000 రూపాయలు గౌరవ వేతనం పెంచాలని ఏఐటీయుసీ డిమాండ్ చేస్తుందన్నారు. 9, 10 తరగతి పిల్లల హాజరును బట్టి గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. రాగి మాల్టు ఇచ్చి ఇప్పటికే ఐదు నెలలు అవుతుంది ఇప్పటివరకు మెస్ ఛార్జీలు చెల్లించలేదు తక్షణమే దాని వెస్ట్ చార్జీలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. సుమారు 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న వంట నిర్వాహకులపై రాజకీయ ఒత్తిడి లేకుండా చేయాలని పనిచేస్తున్న వారిని ప్రభుత్వాలు మారిన తర్వాత తొలగించి కొత్తవారిని వేస్తామని స్థానిక రాజకీయ నాయకులు బెదిరింపులు ఆపకపోతే పర్యవసానం తీవ్రంగా ఉంటుందనీ హెచ్చరించారు. ఆ విధానంకి స్వస్తి పలకాలని అన్నారు. కార్మికుల్ని కొనసాగే విధంగా కార్మికులకు పని భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. తక్షణమే అధికారులు పాలకులు కలుగుచేసుకుని పరిష్కారం చేయని యెడల ప్రత్యక్ష కార్యాచరణకు పూణుకొందుమని అశోక్ హెచ్చరించారు.

ఈ ధర్నా కార్యక్రమంలో పెంకి లక్ష్మి, మల్లన రాజేశ్వరి, గాదం లక్ష్మి, బండరు నారాయణమ్మ విజయనగరం, జామి, అలమండ, గంగచోళ్ళపెంట, జిన్నం, మరుపల్లి తదితర మండల, గ్రామాల నుంచి మధ్యాహ్న భోజన పథక కార్మికులు పాల్గొన్నారు.