గంజాయి వ్యాపారుల ఆస్తులను జప్తు చేస్తాం
- విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి, ఐపిఎస్
జనం న్యూస్ 03 డిసెంబర్
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
విశాఖపట్నం రేంజ్ పరిధిలో గంజాయి వ్యాపారుల ఆస్తులను జప్తు చేయుటకు ఇంత వరకు ఆస్తుల గుర్తింపులో సాధించిన పురోగతిని రేంజ్ డీఐజీ గోపినాథ్ జట్టి, ఐపిఎస్ గారు డిసెంబరు 2న జూమ్ మీటింగ్ నిర్వహించి, సమీక్షించారు.గంజాయి వ్యాపారుల ఆస్తులను గుర్తించి, వాటిని జప్తు చేస్తామన్నారుఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గంజాయి కట్టడికి తీసుకుంటున్న కఠిన చర్యల్లో భాగంగా గంజాయి అక్రమ రవాణకు పాల్పడుతూ, పట్టుబడిన నిందితుల ఆస్తులను జప్తు చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాలతో పోలీసు అధికారులు గంజాయి నిందితుల ఆస్తులను గుర్తించే పని చేపట్టారు.ఇందులో భాగంగా రేంజ్ పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు చెందిన ఎస్పీలు, డీఎస్పీలు, సిఐలతో డీఐజీ గోపినాథ్ జట్టి జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంత వరకు నమోదైన గంజాయి కేసుల్లో అరెస్టు కాబడిన నిందితులు, వారు గంజాయి వ్యాపారంతో కూడబెట్టిన ఆస్తులను గుర్తించాలన్నారు. నిందితుల పేరున గుర్తించిన ఆస్తులను జప్తు చేసేందుకు చేపట్టిట్టాల్సిన విధి, విధానాలు, నిబంధనలను అధికారులకు వివరించారు. ఆస్తుల జప్తుకు చట్ట పరమైన ఎటువంటి చిక్కులు లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.రేంజ్ పరిధిలో ఇంత వరకు నమోదైన కేసుల్లో ఆస్తుల గుర్తింపులో సాధించిన పురోగతిని అధికారులను డీఐజీ అడిగి తెలుసుకొని, అధికారులకు దిశా నిర్దేశం చేసారు.ఈ జూమ్ మీటింగులో విజయనగరం ఎస్పీ వకుల్ జిందల్, మన్యం జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి, శ్రీకాకుళం ఎస్పీ మహేశ్వర రెడ్డి, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ భర్ధర్, అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.