డిజిటల్ అరెస్టు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- విజయనగరం జిల్లా ఎస్సీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 03 డిసెంబర్
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం వన్ టౌన్ పోలీసు స్టేషను పరిధిలో నమోదైన సైబరు క్రైం (డిజిటల్ అరెస్టు) కేసును చేధించి, ఐదుగురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుండి రూ.10 లక్షల నగదు, రూ. 9.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, నిందితులు వినియోగిస్తున్న ఆరు సెల్ ఫోన్లును రికవరీ చేసినట్లుగా జిల్లా పోలీసు కార్యాలయంలో డిసెంబరు 2న నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ వెల్లడించారు.
వివరాల్లోకి వెళ్ళితే.. విజయనగరం పట్టణంకు చెందిన రిటైర్డ్ లెక్చరర్ ఉసిరికల సుజాత కుమారి అనే వ్యక్తికి తే. 10-10-2024 దీన ఉదయం 10-30 గంటల సమయంలో గుర్తు తెలియని ఒక వ్యక్తి ఫోను చేసి, తాము పోలీసులుమని, తాము పంపిన పార్సిల్లో డ్రగ్స్ ఉన్నట్లుగా కనుగొన్నామని, తమని డిజిటల్ అరెస్టు చేస్తున్నామని, డిసిపి స్థాయి అధికారి కేసు విచారణ చేస్తున్నారని, తమ బ్యాంకు అకౌంటులో ఉన్న డబ్బులను వెంటనే తాము సూచించిన బ్యాంకు అకౌంటుకు పంపాలని, తాము బ్యాంకు లావాదేవీలను వెరిఫై చేసిన తరువాత, తిరిగి మొత్తాన్ని తమ బ్యాంకు అకౌంటుకు పంపుతామని బెదిరించడంతో, నిందితులు సూచించిన బ్యాంకు ఖాతాకు ఆమె రూ.40,11,000/- లను పంపినట్లు, అప్పటినుండి నిందితుల మొబైల్ ఫోను చేసినట్లుగా వన్ టౌన్ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చెయ్యగా, పోలీసు కేసు నమోదు చేసారు. పోలీసుల సూచనలతో ఫిర్యాది నా సైబరు క్రైం పోస్టల్ సకాలంలో ఫిర్యాదు చేయడంతో నిందితుల ఖాతాలో రూ. 20 లక్షలు ఫ్రీజ్ అయ్యాయి.
జిల్లా ఎస్పీగారి ఆదేశాలతో ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన వన్ టౌన్ ఇన్స్పెక్టరు ఎస్.శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ఫిర్యాది ఖాతా నుండి నిందితుల ఖాతాలకు జమైన నగదు వివరాలు ప్రకారం, సాంకేతిక పరిజ్ఞానానికి వినియోగించి, నిందితులను గుర్తించారన్నారు. ఈ కేసులో జమ్ము కాశ్మీర్కు చెందిన (ఎ-1) ముమిన్ తారిఖ్ భట్ (33 సం.లు) అనే వ్యక్తిని అరెస్టు చేసి, విచారణ చెయ్యగా, తన బ్యాంకు ఖాతాను కొంతమంది సైబరు నేరగాళ్ళకు అద్దెకు ఇచ్చినట్లు, తన అకౌంటులో పడిన డబ్బులను 5 నిమషాల వ్యవధిలోనే విత్ డ్రా చెయ్యడం లేదా వేరువేరు బ్యాంకు ఖాతాలకు ట్రాన్స్ఫర్ చేయడం చేస్తుంటానని, అందుకు తనకు 3శాతం కమీషను ఇస్తారని తెలిపారు. ఎ-1 ముమిన్ తారిక్ భట్ ఇచ్చిన సమాచారంతో వన్ టౌన్ ఇన్స్పెక్టరు ఎస్.శ్రీనివాస్ మరియు ఇతర పోలీసు బృందం మహారాష్ట్ర వెళ్ళి, డిజిటల్ అరెస్టు పేరుతో మోసాలకు పాల్పడుతున్న మురాను గుర్తించిందనట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ ముఠా టెలిగ్రాం యాప్ ద్వారా గ్రూపుగా ఏర్పడి, దేశ వ్యాప్తంగా ఇదే తరహాలో డిజిటల్ అరెస్టు పేరుతో మోసాలకు పాల్పడుతూ, పెద్ద మొత్తంలో డబ్బులను దోచుకుంటున్నారన్నారు. ఏ-2 ఖసిద్ధి చంద్రకాంత్ సుతార్ (24 సం.లు), ఎ-3 క్లెవిన్ గ్లెన్ బ్రిట్టో (21 సం.లు) ఎ-4 నితిన్ నందలాల్ సరోజ్ (23 సం.లు), ఎ-5 సైఫ్ తలమీ దమంద్ (31 సం.లు) అనే మహారాష్ట్రలోని ముంబయి, పూణేకు చెందిన నలుగురు నిందితులను అరెస్టు చేసారన్నారు. నిందితుల వద్ద నుండి రూ. 10 లక్షల నగదు, రూ.9.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, ఆరు మొబైల్ ఫోన్లును సీజ్చేసామని జిల్లా ఎస్పీ తెలిపారు. నిందితులందరి బ్యాంకు ఖాతాలను సైబరు నిందితులు వినియోగించుకొంటూ, కమీషనుగా వారికి కొంత నగదు చెల్లిస్తున్నట్లుగా విచారణలో వెల్లడైందన్నారు. కమీషను తీసుకొనేందుకు అంగీకరించిన వారిని సైబరు మోసగాళ్ళు లాడ్జిల్లో బస చేయించి, వారి ఆధార్ కార్డు, బ్యాంకు చెక్ బుక్కులు, ప్యాన్ కార్డు, బ్యాంకు బుక్కులను ముందుగా తీసుకొని, వారి వద్ద సెక్యూరిటీగా ఉంచుకొని, మోసాలకు పాల్పడతారన్నారు. ఈ కేసులో ప్రత్యక్ష సంబంధం ఉన్న మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని, వారిని అరెస్టు చేసేందుకు నిఘా పెట్టామని, గాలింపు చర్యలు చేపడుతున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కేసులో రికవరీ చేసిన మొత్తంతోపాటు, ఫిర్యాది సకాలంలో స్పందించిన కారణంగా నిందితుల బ్యాంకు ఖాతాల్లో మరో రూ.22 లక్షలను ఫ్రీజ్ చెయ్యడం జరిగిందన్నారు. ఫ్రీజ్ అయిన మొత్తంను కోర్టు అనుమతితో ఫిర్యాదికి అప్పగిస్తామని, ఈ కేసులో పోగొట్టుకున్న పూర్తి నగదును రికవరీ చేసామని, పరారీలో ఉన్న నిందితులను త్వరలో అరెస్టు చేస్తామని జిల్లా ఎస్పీ పకుల్ జిందల్ తెలిపారు.
డిజిటల్ ఆరెస్టు పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, సైబరు మోసగాళ్ళ బెదిరింపులకు లొంగొద్దని, స్థానిక పోలీసు స్టేషనులో లేదా 1930 లేదా సైబరు క్రైం పోర్టల్ లో ఫిర్యాదు చేయాలని ప్రజలకు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ సూచించారు. ఈ తరహా సైబరు మోసాలను నియంత్రించుటకు అవగాహనే ముఖ్యమన్నారు. సైబరు మోసాలపట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా వీడియోలు రూపొందించి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారాను, పత్రికా ప్రకటనలతో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నానున్నారు.
ఈ కేసు చేధనలో సమర్ధవంతంగా పని చేసిన వన్ టౌన్ సీఐ ఎస్.శ్రీనివాస్, ఎస్ఐ వి.ఎల్. ప్రసన్న కుమార్, కానిస్టేబుళ్ళు వి. రవి శంకర్, ఎస్. రవి కిషోర్, కే.సన్యాసి నాయుడు, వై.రామరాజులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ప్రత్యేకంగా అభినందించి, ప్రశంసా పత్రాలను ప్రదానం చేసారు.