చీ.చీ.. చెల్లి అని పిలుస్తూనే పెళ్ళైన మహిళతో కానిస్టేబుల్ చిల్లర పనులు...! ఆ తరువాత.?
జనం న్యూస్: పోలీసు వ్యవస్థ అంటే జనాల్లో ఎంతో రెస్పెక్ట్ ఉంది. తమకు అన్యాయం జరిగితే తొలుత ఆశ్రయించేది పోలీసులనే. అయితే కొంత మంది చీడ పురుగుల వల్ల వ్యవస్థ మొత్తానికి చెడ్డ పేరు వస్తుంది. తాజాగా ఓ కానిస్టేబుల్ చెత్త పని చేసి వార్తల్లో నిలిచాడు. కనిపించే మూడు సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే.. కనిపించని ఆ నాలుగో సింహమేరా పోలీస్‘ అంటూ పోలీస్ స్టోరీ సినిమాలో సాయి కుమార్ డైలాగ్స్ చెబుతుంటే గూస్ బంప్స్ వస్తుంటాయి. శాంతి భద్రతలను కాపాడుతూ.. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటుంది పోలీస్ వ్యవస్థ. పోలీసులను చూడగానే సెల్యూట్ చేయాలని అనిపిస్తుంది. తమకు ఏదైనా అన్యాయం జరుగుతుంది అంటే పోలీసులు ఉన్నారన్న భరోసా ప్రజలకు ఉంది. అయితే సినిమాల ప్రభావం, కొంత మంది పోలీసులు చేస్తున్న చెత్త పనుల వల్ల వ్యవస్థ మొత్తానికి చెడ్డ పేరు వస్తుంది. ఒక్కరి వల్ల పోలీసులందరిపై నెగిటివ్ ప్రభావం కనిపిస్తుంది. ఇక తమ గోడు విన్నవించుకునేందుకు వచ్చే మహిళల్ని.. నానా రకాలుగా హింసకు గురి చేస్తున్నారు. తమకు లొంగాలని హింసకు గురి చేస్తున్నారు. తాజాగా ఓ మహిళకు న్యాయం చేస్తానని నమ్మించి, చెల్లి, బుజ్జి అంటూ పిలిచి, చివరకు ఆమెను లొంగదీసుకున్నాడు ఓ నీచపు పోలీస్ కానిస్టేబుల్. వివాహితతో కానిస్టేబుల్ రాసలీలలు సాగిస్తుండగా ఆమె భర్త రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో విషయం వెలుగు చూసింది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో రాంబాబు అనే ఏఆర్ కానిస్టేబుల్ బాంబ్ స్క్వాడ్‌లో పని చేస్తున్నాడు. ఓ కేసు విషయమై కోర్టు పని మీద వచ్చిన ఓ వివాహితను పరిచయం చేసుకున్నాాడు రాంబాబు. ‘నీకు న్యాయం చేస్తాను చెల్లి, బుజ్జి’ అంటూ మాయమాటలు పలికాడు. నిజమేనని నమ్మి అతడ్ని సంపద్రించింది. ఈ క్రమంలో ఆమెను లొంగదీసుకున్నారు. ఆమెతో అక్రమ సంబంధాన్ని కొనసాగించాడు. అయితే కొంత కాలంగా భార్య విచిత్రంగా ప్రవర్తిస్తుండటంతో భర్తకు అనుమానం ఏర్పడింది. ఆమెపై నిఘా పెట్టాడు. అయితే కోర్టు పనిమీద బయటకు వెళుతున్నానని భర్తకు చెప్పి ఇంట్లో నుండి వెళ్లింది. ఖమ్మం టౌన్‌లోని ఓ హోటల్‌లో ఏకాంతంగా ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. భర్త చర్యతో భార్య ఖంగుతింది. కానిస్టేబుల్ రాంబాబు భర్తపై దాడి చేసి అక్కడి నుంచి పారిపోయాడు. అంతలో భార్య దగ్గర ఫోను లాక్కొని చూడగా.. వీరిద్దరూ ఏకంతంగా గడిపిన ఫోటోలు, వీడియోలు దొరికాయి. తన భార్య మోసం చేసిందని భర్త ఆవేదన వ్యక్తం చేశాడు. తమకు పెళ్లై 10 ఏళ్లు అవుతుందని, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు తెలిపాడు. కానిస్టేబుల్ రాంబాబుపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్యను ట్రాప్ చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. చెల్లి అంటూ ఆమెను లొంగదీసుకున్నాడని తెలిపాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపడుతున్నారు.