నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా లైవ్ లో సర్పంచ్ దారుణ హత్య ( వీడియో చూడండి).

నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా లైవ్ లో సర్పంచ్ దారుణ హత్య ( వీడియో చూడండి).

జనం న్యూస్: ఓ గ్రామ సర్పంచ్ ను కొందరు దుండగులు నడిరోడ్డుపై అతి దారుణంగా హత్య చేశారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. సర్పంచ్ పై దాడి చేస్తున్న దృశ్యాలు స్థానిక సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. దేశంలో క్రైమ్ రేటు క్రమ క్రమంగా పెరుగుతూనే ఉంది. అదుపు చేసేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా.. దారుణాలు మాత్రం అస్సలు ఆగడం లేదు. పక్కా ప్లాన్ తో కొందరైతే, క్షణికావేశంలో మరి కొందరు రెచ్చిపోతూ హత్యలకు కత్తులు నూరుతున్నారు. దేశ వ్యాప్తంగా రోజు ఎన్నో హత్య కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. అయితే తాజాగా కొందరు దుండగులు నడిరోడ్డుపై సర్పంచ్ ను అతి కిరాతకంగా నరికి చంపారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. మహారాష్ట్ర పూణే పరిధిలోని షిర్గావ్ గ్రామంలో ఓ వ్యక్తి సర్పంచ్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఏదో విషయంపై సర్పంచ్ పై కొందరు వ్యక్తులు పగతో ఊగిపోతున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా సర్పంచ్ ఊళ్లోని నడిరోడ్డుపై ఓ చోట స్కూటీపై కూర్చుని స్థానికులతో మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే ముగ్గురు యువకులు బైక్ పై సర్పంచ్ ఉన్నచోటుకు వచ్చారు. ఇక వస్తు వస్తూనే ఆ దండుగులు బైక్ దిగి సర్పంచ్ ను కత్తులతో నరికారు. అతడు అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయినా వదలని ఆ దుండగులు.. పరుగెత్తించి పరుగెత్తించి నరికి చంపారు. ఈ ఘటనతో స్థానికులు అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే కొందరు వ్యక్తులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సర్పంచ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అనంతరం ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయితే సర్పంచ్ పై దాడి చేస్తున్న దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. నడిరోడ్డుపై సర్పంచ్ ను అతి కిరాతకంగా హత్య చేసిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

కింద ఉన్న లింక్ ఓపెన్ చేసి వీడియో చూడండి.

https://twitter.com/hardintessa143/status/1642792718249127936?s=20