మహిళతో పబ్లిక్ గా చిల్లర వేషాలు వేసిన పోలీసు.. చావకోట్టిన ప్రజలు.. (వీడియో చూడండి)

జనం న్యూస్: ప్రజల మాన, ప్రాణాలను కాపాడేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని చేసే ప్రమాణాలను చాలా మంది పోలీసులు మనసా, వాచా పాటిస్తుంటారు. అయితే కొందరు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఆ డిపార్ట్‌మెంట్‌కే చెడ్డ పేరు తెస్తుంటారు. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ పోలీసు కానిస్టేబుల్ రైల్వే ప్లాట్‌ఫామ్‌పై మహిళ కూర్చున్నాడు. ఈ క్రమంలో నిద్రపోయినట్లు నటిస్తూనే అతడు చేస్తున్న నిర్వాకం చూసి అంతా షాక్ అయ్యారు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి. ఎక్కడ జరిగిందో ఏమో తెలీదు గానీ.. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై చాలా మంది ప్రయాణికులు కూర్చుని ఉంటారు. వారిలో ఇద్దరు మహిళల పక్కన ఓ కానిస్టేబుల్ కూడా కూర్చుని ఉంటాడు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఆ పోలీసు తన అసలు బుద్ధి బయటపెట్టాడు. ఎవరికీ అనుమానం రాకుండా నిద్రపోయినట్లు నటిస్తూనే పక్కన ఉన్న మహిళ వీపుపై చేయి వేశాడు. పోలీసు చేయి వేస్తున్న విషయం తెలిసినా.. అతను పోలీసు కావడంతో ఆమె సైలెంట్‌గా ఉండిపోయింది. దీంతో ఆ పోలీసు మరింత రెచ్చిపోయాడు. చేత్తో పదే పదే ఆమె వీపును తాకుతూ తన శాడిజాన్ని బయటపెట్టాడు. ఈ క్రమంలో ఎదురుగా ఉన్న వారు, పక్కన ఉన్నవారు కూడా అతడి చేష్టలను గమనించారు. అయితే అతన్ని వారించేందుకు ముందు తటపటాయించారు. అయితే పోలీసులు పదే పదే అలాగే ఇబ్బంది పెడుతుండడంతో ఆమె తన పక్కన ఉన్న మహిళతో విషయం చెప్పింది. దీంతో చివరకు ఆమె స్పందించి పోలీసు చేయి పక్కకు లాగి నిలదీసింది. దీంతో పోలీసు పక్కన కూర్చున్న వ్యక్తి పైకి లేచి అతడికి బుద్ధి చెప్పాడు. పోలీసును చితకబాదిన ఆ వ్యక్తి.. ''పోలీసువు అయి ఉండి.. ఇలాంటి పని చేయడానికి సిగ్గు లేదా''.. అంటూ మందలిస్తాడు. అంతా ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేయడంతో సదరు పోలీసు భయంతో అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తాడు. అయినా ఆ మహిళ అతన్ని వదలకుండా పట్టుకుని లాక్కొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ''ఇలాంటి పోలీసులను కఠినంగా శిక్షించాలి''.. అంటూ కొందరు, ''ఇలాంటి వారి వల్ల.. పోలీసులపై నమ్మకం పోతోంది''.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 87 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.