రైతులు సబ్సిడీ విత్తనాలు సద్వినియోగం చేసుకోవాలి ఏవో తులసిరామ్.

రైతులు సబ్సిడీ విత్తనాలు సద్వినియోగం చేసుకోవాలి ఏవో తులసిరామ్.

 జనం న్యూస్ సెప్టెంబర్ 30 వికరాబాద్ జిల్లా పూడూరు మండలంలోని వివిధ గ్రామాల రైతులు సబ్సిడీపై వచ్చిన విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఏవో తులసిరామ్ అన్నారు. పూడూరు మండల కేంద్రంలోని యాసంగి కి సబ్సిడీపై విత్తనాలు ఒక్క ఎకరానికి కుసుమలు 4 కేజీలు బ్యాగ్ ధర 332, శనిగలు 25 కిలోలు బ్యాగు ధర 2250, అందుబాటులో ఉన్నాయన్నారు. కుసుమలు శనిగలు వేసుకునే రైతులు రెండు పంటలు వేసుకుంటే వంద రోజులలో వస్తుందని యాసంగిలో మన ప్రాంతానికి చాల అనుకూలం అన్నారు. అందుకోసం ప్రభుత్వరంగ సంస్థలైన తెలంగాణ ప్రభుత్వ విత్తన కార్పోరేషన్ వారు అగ్రోస్ ద్వారా, మంచి నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచారు.దీనిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని, మండల వ్యవసాయ అధికారి తులసిరామ్ తెలిపారు.