సెలవు రోజుల్లో తరగతులను అడ్డుకున్న SFI

సెలవు రోజుల్లో తరగతులను అడ్డుకున్న SFI

విద్యార్థులకు ఒత్తిడి నీ దూరం చేసే సెలవలను వారికి దూరం చెయ్యొద్దని వినతి
జనం న్యూస్ 08 నవంబర్
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
దసరా సెలవులు ప్రభుత్వం ప్రకటించి 6 రోజులు గడుస్తున్న విజయనగరం జిల్లాలో మాత్రం ప్రభుత్వ ఆదేశాలకు వ్యతిరేకంగా కళాశాలలు, పాఠశాలలో తరగతులు నడుస్తున్నాయి. వీటిపై వచ్చిన సమాచారంతో ఎస్ఎఫ్ఐ బృందం ఆయా కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థలను సందర్శించి  తరగతులు నిర్వహిస్తున్న యాజమాన్యాలతో మాట్లాడి విద్యార్థులకు సెలవులు ప్రకటించింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి CH వెంకటేశ్  మాట్లాడుతూ విజయనగరం పట్టణంలో పలు విద్యాసంస్థలు ఇప్పటికీ దసరా సెలవులు ప్రకటించలేదని , విద్యార్థులకు సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ సెలవల్లోనే వారు వారి స్వస్థలాలకు వెళ్లడం , వారి బంధుమిత్రుల ఇంటికి వెళ్లి సరదాగ ,  సంతోషంగా ఫ్యామిలీ మధ్యలో ఆడుతూ పాడుతూ ఉండే టైం అటువంటి టైంలో  ఇప్పటివరకు సెలవులు ప్రకటించకపోవడం సిగ్గు చేటని విమర్శించారు . భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ టౌన్ కమిటీ దీనిని తీవ్రంగా ఖండిస్తుంది. విద్యార్థులకు సెలవులు ఇవ్వకపోవడంతో వారి తీవ్ర ఒత్తిడికి గురవతున్నారని , దానితో ఒత్తిడి తట్టుకోలేక మత్తు పదార్థాలకు బానిస అయ్యే అవకాశం ఉందని , దానితో పాటు ఆత్మ హత్యలు జరిగిన సంఘటనలు కూడా గతం లో చూశామని తెలిపారు. కావున తక్షణమే అధికారులు సెలవులు అమలయ్యేలా చూడాలని కోరారు.ఈరోజు టౌన్ లో అనేక చోట్ల ఎస్ఎఫ్ఐ పట్టణ కమిటీ కాలేజీ ల వద్ద , స్కూల్ దగ్గర ఆందోళన చేయడం జరిగింది.తక్షణమే అధికారులు మొద్దు నిద్దుర వీడి తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలలను , కళాశాలలను సందర్శించి చర్యలు తీసుకొని సెలవులు ప్రకటించే విధంగా కృషి చేయాలని కోరారు.  రేపటి నుంచి ఏ యాజమాన్యం తరగతులు నిర్వహించిన ఎస్ఎఫ్ఐకి సమాచారం ఇవ్వాలని, విద్యార్థుల పక్షాన ఎస్ఎఫ్ఐ పోరాడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు కె రాజు ,  ఉప అధ్యక్షుడు గుణ , రాహుల్,  సాయి ,యశ్వంత్ టౌన్ కార్యకర్తలు పాల్గొన్నారు.