మద్నూర్ మండల కేంద్రంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు.
జనం న్యూస్, డిసెంబర్ 11 (మద్నూర్ ). కామారెడ్డి జిల్లాలోని , మద్నూర్ మండల కేంద్రానికి కేంద్రీయ విద్యాలయం మంజూరు అయినట్లు కామారెడ్డి జిల్లా డి ఈ ఓ రాజు ఒక ప్రకటనలో తెలుపుతూ సర్కులర్ జారీ చేశారు. కేంద్రీయ విద్యాలయానికి నూతన భవన నిర్మాణం కోసం మద్నూర్ గ్రామ శివారు పరిధిలోని 499/2 /1 సర్వే నంబర్లో పది ఎకరాల 9 గుంటలు భూమి చూయించినట్లు పేర్కొన్నారు.