మంగళవారం రోజుగూడూరు శ్రీగురుపీఠంలో స్వామివారికి ప్రత్యేక పూజలు
శ్రీగురుపీఠం ప్రధాన అర్చకులు వంశీకృష్ణ ఆధ్వర్యంలో నిత్యం పూజలు....
శ్రీగురుపీఠం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జిన్నారంజి.శివకుమార్ గౌడ్.రమాదేవిదంపతుల సహకారంతో బాలలయంలో స్వామివారికి పతి రోజు కొనసాగుతున్న మహాపూజలు..
జనం న్యూస్ నవంబర్27.24 శివంపేట మండలం మెదక్ జిల్లా కే సత్యనారాయణ గౌడ్
తెలంగాణ రాష్ట్రంలోనే భవిష్యత్ తరాల ఆధ్యాత్మికతకు మారుపేరుగా వెలుగొందబోతున్న మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గూడూరు గ్రామంలో నూతనంగా శ్రీగురుపీఠం నిర్మాణ పనులు దివంగత జిన్నారం పెద్దగోని లింగయ్య గౌడ్ - అంజమ్మ పుణ్య దంపతుల కుమారుడైన శ్రీబగలాముఖీ ట్రస్ట్ సభ్యులు, హైకోర్టు సీనియర్ న్యాయవాది, శ్రీగురుపీఠం ట్రస్ట్ పౌండర్ చైర్మన్, జిన్నారం పెద్దగోని శివకుమార్ గౌడ్- రమాదేవి దంపతుల ఆధ్వర్యంలో పనులు చక చక జరుగుతుండగా ఇదే శ్రీగురుపిఠంలోని బాలాలయంలో మంగళవారం రోజు శ్రీదత్తాత్రేయ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. పౌండర్ చైర్మన్ జిన్నారం పెద్ద గోని జి.శివకుమార్ గౌడ్ సహకారంతో నిర్వహించబడుతున్న ప్రత్యేక పూజలలో భాగంగా గూడూరు శ్రీగురుపీఠం ప్రధాన అర్చకులు వంశీకృష్ణ ఆధ్వర్యంలో మంగళవారం రోజు దత్తాత్రేయ స్వామి.సాయిబాబా. సుబ్రహ్మణ్యం స్వామి. వెంకటేశ్వర స్వామి స్వామివారి విగ్రహాలకు ఆవు పాలు నెయ్యితో విగ్రహాలకు అభిషేకం హారతి నిర్వహించడం జరిగింది స్వామివారికి మహా పూజలు అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించడం జరిగినది. ఈసందర్బంగా గూడూరు గురు పీఠం ప్రధాన అర్చకులు వంశీకృష్ణ మాట్లాడుతూ దత్తాత్రేయ స్వామి, షిరిడి సాయినాథునికి, సుబ్రహ్మణ్యం స్వామి. వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగినాదని అన్నారు. నిత్య పూజలలో భాగంగా పంచామృతాలు, ఆవు పాలు నెయ్యి స్వామివారి విగ్రహాలకు అభిషేకంతో పాటు హారతి నిర్వహించడం జరిగినదని అన్నారు. బాలలయంలో ప్రతినిత్యం పూజా క్రతువులు ఉంటాయని, స్వామివారి మహాపూజలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని గూడూరు గురు పీఠం ప్రధాన అర్చకులు వంశీకృష్ణ విజ్ఞప్తి చేశారు. బాలలయంలోని ప్రత్యేక పూజలలో ట్రస్ట్ సభ్యులు, జిన్నారం పెద్దగోని జి. సూర్య కుమార్ గౌడ్, కొంతాన్ పల్లి సత్యనారాయణ గౌడ్, పోల్దాస్ వెంకటస్వామి, శ్రీనివాస్ చారి. వడ్ల బ్రహ్మచారి,బానూరి గోనయ్య గౌడ్. మల్లయ్య గౌడ్, ఆలయ నిర్మాణ కార్మికులు భక్తులు పాల్గొన్నారు.