ఇంటి పర్మిషన్ తో షాపింగ్ కాంప్లెక్స్ లు...!.

ఇంటి పర్మిషన్ తో షాపింగ్ కాంప్లెక్స్ లు...!.

జనం న్యూస్ 24 డిసెంబర్ 2024 జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా 

- గద్వాల మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ లో  ఇష్టారాజ్యం
- చిత్తారి వీధి రోడ్ సైతం కబ్జా
- సెట్ బ్యాక్ లేకుండానే నిర్మాణాలు
జోగులాంబ గద్వాల జిల్లా : ప్రతి నిధి డిసెంబర్ 23. (మెట్రో న్యూస్ ) 

గద్వాల మున్సిపాలిటీలోని టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో ఆఫీసర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఫేక్ డాక్యుమెంట్ లతో ఎల్పీలకు అప్రూవల్ ఇవ్వడం, రిక్రియేషన్ జోన్ అక్రమ కట్టడాలకు పర్మిషన్లు ఇవ్వడం, ఇండ్లకు పర్మిషన్లు ఇచ్చి షాపింగ్ కాంప్లెక్స్ లు కట్టుకున్న పట్టించుకోకపోవడం ఇలా అవినీతి దందా మొత్తం టౌన్ ప్లానింగ్ సెక్షన్ అడ్డగా జరుగుతుందని విమర్శలు గుప్పుమంటున్నాయి. గద్వాల టౌన్ గాంధీ చౌరస్తా సమీపంలో మెయిన్ రోడ్డు లో ఇంటికి పర్మిషన్లు తీసుకొని షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపడుతున్న ఆఫీసర్లు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్ చిత్తారి కిరణ్, ఆరోపించారు. గద్వాల టౌన్ లో రద్దీగా ఉండే ప్లేస్ లలో గాంధీ చౌక్ ప్రధానమైనదని, అక్కడ మెయిన్ రోడ్డు ప్లేస్ లో సెట్ బ్యాక్ లేకుండా కాలనీకి వెళ్లే రోడ్డును మూసేసి నిర్మాణాలు చేపడుతున్నారని వాపోయారు. గద్వాల టౌన్ లోని రథశాల వెనకాల ఉన్న ప్లేస్ లో ఇంటి పర్మిషన్లతోనే కాంప్లెక్స్ కట్టిన ఆఫీసర్లు పట్టించుకోలేదని పట్టణవాసులు మండిపడుతున్నారని తెలిపారు.- ఇంటి పర్మిషన్ తో కాంప్లెక్స్..గద్వాల టౌన్ గాంధీ చౌక్ సమీపంలో ఖాళీ ప్లేస్ లో ఇంటి పర్మిషన్ కోసం ఓనర్లు మున్సిపాలిటీకి అప్లికేషన్ పెట్టుకున్నారు. రెసిడెన్షియల్ బిల్డింగ్ నిర్మాణాన్ని గ్రౌండ్ ఫ్లోర్ లో మాత్రమే కడతామని ప్లాట్ నెంబర్ 4-1-50/సి ప్లాట్ లో ముగ్గురు వ్యక్తులు గ్రౌండ్ ఫ్లోర్ రెసిడెన్షియల్ బిల్డింగ్ నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకోగా 2/ 12/24న ఇంటి నిర్మాణం కోసం పరిమిషన్ గద్వాల మున్సిపాలిటీ ఇచ్చిందన్నారు. అక్కడ రెసిడెన్షియల్ బిల్డింగ్ నిర్మించకుండా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని చేపడుతున్నారని బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్ చిత్తారి కిరణ్ ఆరోపిస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ కు మాత్రమే పర్మిషన్ తీసుకొని పై అంతస్తు కూడా నిర్మాణం చేపట్టారని పేర్కొన్నారు. అంతేకాకుండా కాలనీకి వెళ్లే ఎనిమిది ఫీట్ల రోడ్డును కూడా కబ్జా చేసి నిర్మాణాన్ని చేపడుతున్నారని మండిపడుతున్నారు. బిల్లింగ్ నిర్మాణాన్ని ఆపాలని మున్సిపల్ ఆఫీసులకు చెప్పిన పట్టించుకోవడంలేదని ఆఫీసర్ల పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.- టౌన్ ప్లానింగ్ సెక్షన్ లొనే చక్రం తిప్పుతుండ్రు..టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో ఆఫీసర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తూ చక్ర తిప్పుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాత బస్టాండ్ దగ్గర మెయిన్ రోడ్డు కు ఆనుకొని మున్సిపాలిటీ స్థలంలోని డ్రైనేజీ పై షేటర్ నిర్మాణానికి, రథశాల వెనకాల కందకం స్థలంలో ఇంటి నిర్మాణాల పేరిట షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించేందుకు పెద్ద ఎత్తున డబ్బులు దండుకున్నారనే విమర్శలు ఉన్నాయన్నారు. గల్లీ రోడ్డు సైతం కబ్జా..రూల్స్ కు విరుద్ధంగా షాపింగ్ కాంప్లెక్స్ కడుతూ చిత్తారి వీధికి వెళ్లే గల్లి రోడ్డును సైతం కబ్జా చేస్తున్నారన్న ఆఫీసర్లు పట్టించుకోవటం లేదని పేర్కొన్నారు. ఇండ్లకు పక్కన సెట్ బ్యాక్ లేకుండా రద్దీ ఉండే ప్రాంతంలో కాంప్లెక్స్ నిర్మాణం చేస్తున్న మున్సిపల్ ఆఫీసర్లు చోద్యం చూస్తున్నారని  మండిపడుతున్నారు.- రూల్స్ బ్రేక్ చేసిన పట్టించుకోరు..పర్మిషన్ తీసుకొని ఇష్టారాజ్యంగా రూల్స్ బ్రేక్ చేసి నిర్మాణాలు చేస్తున్న టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయని తెలిపారు. పెద్ద ఎత్తున డబ్బులు దండుకొని ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపట్టేందుకు వారే ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయన్నారు. ప్రతి పర్మిషన్ కు ఓ రేటును ఫిక్స్ చేసి మరి అందిన కాడికి దండుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. రోడ్డు కబ్జా కాకుండా చూడాలి..
చిత్తారి వీధికి వెళ్లే రోడ్డును కబ్జా కాకుండా చూడాలి. కాలనీకి వెళ్లే దగ్గర ఇష్టారాజ్యంగా షాపింగ్ కాంప్లెక్స్ కడుతున్నారు. దీంతో ఇప్పుడు రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. రోడ్డు కబ్జాపై నిరసన కార్యక్రమాలకు సిద్ధమవుతున్నాం. ఎంక్వైరీ చేస్తాం..రూల్స్ కు విరుద్ధంగా ఎవరు నిర్మాణాలు చేపట్టిన ఉపేక్షించేది లేదని గద్వాల మున్సిపల్ కమిషనర్ దశరథం తెలిపారు. షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణంపై ఎంక్వయిరీ చేస్తాం. పర్మిషన్ లేకుండా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేస్తే భవిష్యత్తులో వారికి చాలా ఇబ్బందులు వస్తాయని, టౌన్ ప్లానింగ్ సెక్షన్ పై కూడా దృష్టి పెడతామన్నారు.