ఇది కదా నాయకుల లక్షణం

ఇది కదా నాయకుల లక్షణం

 జనం న్యూస్ 5 డిసెంబర్ భీమారం మండల ప్రతినిధి (కాసి పేట రవి )

 భీమారం మండల కేంద్రంలోని గురువారం  రోజున జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ లో చదువుకుని ఉన్నత విద్యావంతులు లాయర్లు టీచర్లు ఐఏఎస్ లు కూడా అయినా,   కొన్ని సంవత్సరాల నుండి  మరుగుదొడ్ల  ఇబ్బందులు ఉన్న సంగతి  నాయకులకు  తెలిసిందే, ఇంత పెద్ద సమస్యను , పట్టించుకున్న పాపాన పోలేదు  ఇంతమంది జీవిత కొనాలను మార్గం చూపించిన  విద్యాలయాన్ని ఎలా మర్చిపోతున్నారు ప్రభుత్వం నుండి వచ్చే నిధులు ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితి ఏ ప్రభుత్వం వచ్చినా ఈ దుస్థితి ఇట్లనే ఉంటుంది, ఈ విద్యాలయాన్ని  భీమారం మండల కాంగ్రెస్ నాయకులు బూనేని సుధాకర్, కొక్కుల నరేష్.సమస్యలని అడిగి తెలుసుకోవడం 
మధ్యాన్హ భోజన శాలను పరిశీలించడం జరిగింది,  ఈ సమస్యను గౌరవ శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి  ద్రుష్టి కి తీసుకువెళ్లి పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమం లో  స్కూల్ హెడ్ మాస్టర్ వెంకటేశ్వర్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.