గ్రంథాలయ సేవా సంఘం వార్షిక ప్రణాళిక విడుదల

గ్రంథాలయ సేవా సంఘం వార్షిక ప్రణాళిక విడుదల

జనం న్యూస్ 15 డిసెంబర్
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
జిల్లా గ్రంథాలయ సేవా సంఘం వార్షిక ప్రణాళికను శనివారం జిల్లా కార్యాలయంలో సంఘ నాయకులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి విడుదల చేసారు. ముందుగా గ్రంథాలయ ఉద్యమ నాయకులు జయంతి రామలక్ష్మణ మూర్తి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం సంఘం వ్యవస్థాపకులు అబ్దుల్ రవూఫ్, అధ్యక్షులు కె. ఎర్నాయుడులు మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని, ప్రధానంగా నూతన గ్రంథాలయాల స్థాపన, ఇంటింటి గ్రంథాలయాలు, పుస్తకహుండీ, పుస్తక వితరణ లాంటి కార్యక్రమాలను నిరంతరం చేపడుతున్నట్లు తెలిపారు. వీటితో బాటు గ్రంథాలయ ఉద్యమకారులు, స్వాతంత్ర సమరయోధులు, సంఘ సంస్కర్తల స్ఫూర్తిని చాటేందుకు వారి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను కూడా నిర్వహించేలా వార్షిక ప్రణాళిక తయారు చేసామని అన్నారు. సంఘం కార్యక్రమాలను మరింత విస్కృతంగా చేపట్టెందుకు స్వచ్ఛంద సంస్థలను కలుపుకుని వెళ్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు నాలుగేస్సులరాజు, ఉపాధ్యక్షులు కె.దయానంద్, ప్రధాన కార్యదర్శి రత్నాల బాలకృష్ణ, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రొంగళి పోతన్న, సాహితీ వేత్తలు డాక్టర్ జక్కు రామకృష్ణ, జి.ఎస్.చలం, విజయెస్వరరావు, బి.సూర్యలక్ష్మి, కంది మూర్తి, సుభద్రాదేవి, అర్నేపల్లి సింహాచలం, చుక్కా సాయిరెడ్డి, వాకర్స్ క్లబ్ సభ్యులు కర్రోతు సత్యం, శ్రీరామూర్తి, శ్రీనివాసరెడ్డి, ఆదినారాయణ, కొల్లి సత్యం, విశ్వనాధం, ఆంజనేయరాజు తదితరులు పాల్గొన్నారు.