తడ్కల్ నాల్గవ అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అన్న ప్రసన్న అక్షర అబ్యాసం

తడ్కల్ నాల్గవ అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అన్న ప్రసన్న అక్షర అబ్యాసం

అంగన్వాడీ టీచర్ జి సువర్ణ

జనం న్యూస్,డిసెంబర్ 09,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ నాల్గవ అంగన్వాడీ కేంద్రంలో సోమవారం చిన్నారులకు అన్న ప్రసన్న,అక్షర అబ్యాసం అంగన్వాడీ టీచర్ జి సువర్ణ ఘనంగా నిర్వహించరు.ఈ సందర్బంగా మాట్లాడుతూ చిన్న పిల్లలు తల్లి పలు తాగుతుంటారు, కనుకనే చిన్న పిల్లలకు మొదటి సరిగా అంగన్వాడీ కేంద్రం పరిదిలోని చిన్నారులకు అన్నం తినిపించే కోరకై ప్రతి సంవత్సరం ప్రభుత్వ ఆదేశాల మేరకు అంగన్వాడీ కేంద్రలలో అన్న ప్రసన్న కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటామని అన్నారు.చిన్నారులు తొలిప్రాయంలో అక్షరాలను దిదే విద్య కొరకై అక్షరాభ్యాస కార్యక్రమాన్ని పిల్లలతో నిర్వహించడం జరుగుతుందని అన్నారు.చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించడం వల్ల ఉన్నత స్థాయి విద్యను అభ్యసించి ప్రతిభావంతులు కావాలన్న సదుద్దేశంతో అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో చిన్నారుల సంరక్షకులు,  చిన్నారులు పాల్గొన్నారు.